యాంకర్ ఉదయభాను సరదా.. ఏకంగా దాన్నే కొనేసిందిగా!
యాంకర్ ఉదయభాను.. ఈ పేరు చెబితే తెలియని వారు ఒక్కరు కూడా ఉండరు. ప్రెజెంట్ అంత పాపులర్ కాకపోయినప్పటికీ.. బుల్లితెరను ఒకప్పుడు మహారాణిలా ఏలుతూ మాటల గారడి చేసింది ఈ బ్యూటీ. కుర్రకారును ఓ ఊపు ఊపేస్తూ చలాకీగా చిందులేయడం ఈమె నైజం. కాగా తాజాగా ఓ ఖరీదైన వస్తువు కొని వార్తల్లో నిలిచింది ఉదయభాను. ఇంతకీ ఏంటా వస్తువు? దాని ఖరీదు ఎంత? వివరాల్లోకి పోతే..

లేడీ సూపర్ స్టార్.. సత్తా చాటుతూ
ఒకానొక సమయంలో బుల్లితెరపై మాటల సందడి చేసి హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఉదయభాను. లేడీ సూపర్ స్టార్‌గా తన సత్తా చాటింది. ఆమె హోస్ట్ చేసిన ''డాన్స్ బేబీ డాన్స్, సాహసం చేయరా డింభకా'' లాంటి టీవీ షోస్ ప్రేక్షకులకు అమాంతం ఆకట్టుకున్నాయి. దీంతో బుల్లితెర ఆడియన్స్ గుండెల్లో అలా స్థిరపడిపోయింది ఉదయభాను.

ఉదయభాను వైవాహిక జీవితం.. పెళ్లి, పిల్లలు
బుల్లితెరపై ఆకట్టుకుంటూనే సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసింది ఉదయభాను. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకొని కొద్దిరోజులు ప్రేక్షకలోకానికి దూరంగా ఉంది. విజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఉదయభాను.. కవల పిల్లలకు జన్మనిచ్చి.. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఇంటికే పరిమితమై పోయింది.

ఉదయభాను ఫ్యామిలీ.. బెంజ్ కారు
కాగా తాజాగా ఓ ఖరీదైన బెంజ్ కారు కొన్న ఉదయభాను.. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చింది. ఉదయభాను ఫ్యామిలీ అంతా నిండుగా కనిపిస్తుండటంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
Recommended Video


సెకండ్ ఇన్నింగ్స్.. క్రమంగా ఫామ్ లోకి
ఇకపోతే ఇటీవలే బుల్లితెరపైకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను.. క్రమంగా ఫామ్ లోకి వస్తోంది. ‘కళ్యాణ లక్ష్మి' అనే మహిళా కార్యక్రమానికి యాంకర్‌గా, ‘జూలకటక' అనే కామెడీ షోకు జడ్జిగా పనిచేసి.. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్' అనే కామెడీ ప్రొగ్రామ్ యాంకర్‌గా కొనసాగుతోంది. అలాగే కొన్ని ఈవెంట్స్‌కి హోస్ట్‌గా చేస్తోంది. ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











