తీక్షణంగా సముద్రాన్ని వీక్షిస్తోన్న వర్షిణి.. పొట్టి డ్రెస్‌తో గోవాలో మంటపెడుతోన్న యాంకర్
యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో, బుల్లితెరపై ఎంత అల్లరి చేస్తుందో అందరికీ తెలిసిందే. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయింది. కానీ బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలతోనే బాగా ఫేమస్ అయింది. పటాస్, ఢీ వంటి షోలతో వర్షిణి ఫుల్ ఫేమస్ అయింది. అలా మెల్లిమెల్లిగా బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా ఎదిగేసింది వర్షిణి. మధ్యలో హైపర్ ఆదితో కుదరిని కెమిస్ట్రీతో మరింత వైరల్ అయింది.

ఢీ షోలో రచ్చ..
ఢీ 12వ సీజన్‌లో హైపర్ ఆది వర్షిణి టీం లీడర్లుగా ఒకే గ్రూపులో ఉండేవారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి అందరూ రకరకాల వార్తలు రాసేవారు. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతోన్నారని రూమర్లు వచ్చేవి. అయితే వాటిపై ఆది, వర్షిణి ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చింది. తాను, ఆది మంచి స్నేహితులమేనని చెప్పుకొచ్చింది.

బ్రేకప్ కూడా..
వర్షిణికి గతంలో బ్రేకప్ అయిందట. నిశ్చితార్థం కూడా అయిందంటూ ఆ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, కానీ తనకు పెళ్లి కాలేదంటూ వర్షిణి క్లారిటీ ఇచ్చింది. ఆ బ్రేకప్ వల్ల కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వర్షిణి చెప్పుకొచ్చింది.

ఢీ నుంచి అవుట్..
అయితే కొత్తగా ప్రారంభమైన ఢీ 13వ సీజన్‌లో వర్షిణిని తీసుకోలేదు. ఆమె స్థానంలో టిక్ టాక్ స్టార్ దీపిక పిల్లిని తీసుకొచ్చారు. మరి వర్షిణిని తీసుకోకపోవడానికి గల కారణాలేంటో మాత్రం బయటకు రావడం లేదు. మొత్తానికి వర్షిణి ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంది.

న్యూ ఇయర్ పార్టీ..
వర్షిణి ప్రస్తుతం గోవాలో సందడి చేస్తోంది. మామూలుగా వర్షిణి తన ఫ్యామిలీతో కలిసి బయటకు వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. తన అక్కతో కలిసి బయట రచ్చ రచ్చ చేస్తుంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా వర్షిణి గోవాకు చెక్కేసింది. అక్కడ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

పొట్టి డ్రెస్‌తో..
పొట్టి డ్రెస్ వేసుకున్న వర్షిణి.. సముద్రాన్ని తీక్షణంగా వీక్షిస్తోంది. అనంతమైన సముద్రాన్ని వీక్షిస్తూ ఎక్కడికో వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. వెనకాల నుంచి వర్షిణిని ఇలా కెమెరాలో బంధించగా.. ఆమె ఈ ఫోటోను ప్రస్తుతం షేర్ చేసింది. మొత్తానికి ఈ ఫోటో మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొట్టేస్తోంది.


Click it and Unblock the Notifications











