తొలిసారి భార్య, అకీరా, ఆద్యలతో పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్
పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఆయన సుదీర్ఘ కాలంగా సినిమా రంగంలో, కొన్నేళ్లుగా రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అదే సమయంలో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకుని సెన్సేషనల్ స్టార్ అనిపించుకున్నారు. ఇక, ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్.. ఎన్నో విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టారు. ఇక, తాజాగా ఆయన తన ఫ్యామిలీతో ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!
కూటమి కొత్త ప్రభుత్వం:జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి.. గత ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవలే జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంతో కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా తొలిసారి పవన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టేశారు.

డిప్యూటీ సీఎంగా పవన్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహచర మంత్రులకు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం హోదాను అందించారు. అదే సమయంలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను అప్పగించారు.
పవన్ కోసం ప్రత్యేకంగా:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నో ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు చాలా సౌకర్యాలను అందించారు. అలాగే, ఎన్నో గౌరవాలను కూడా చేకూర్చుతున్నారు. మొత్తంగా ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ స్థానం వేరే అని చంద్రబాబు నాయుడు నొక్కి చెబుతున్నారు.
ప్రజా దర్భార్ ఏర్పాటు:డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు తొలిసారి అసెంబ్లీలో ప్రసంగించిన పవన్ కల్యాణ్.. ఆ వెంటనే ప్రజల సమస్యలపై ఫోకస్ చేశారు. ఇందులో మంగళగిరిలోని నివాసం వద్ద ప్రజా దర్భార్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇదంతా చూసి ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
భార్య, పిల్లలతో పవన్:కొంత కాలంగా సినిమాలతో, ఇప్పుడు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫ్యామిలీ లైఫ్‌ను గోప్యంగా ఉంచుతుంటారు. కానీ, ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన భార్య, పిల్లలు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే తాజాగా భార్య అన్నా లెజ్నేవా, అకీరా నందన్, ఆద్యలతో కలిసి పవన్ దిగిన ఫొటో ఒకటి బయటకు వచ్చి సెన్సేషన్ అవుతోంది.

పిక్ ఎక్కడ తీశారంటే:భార్య పిల్లలతో కలిసి పవన్ కల్యాణ్ తీసుకున్న ఫొటోను జనసేన పార్టీ అధికారిక ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'పవన్ కల్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి వస్తున్న సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అప్పుడు ఆయన వాహనం ఆపేసి సేద రోడ్డు పక్కన సేద తీరారు. ఈ సందర్భంగానే ఈ ఫొటోను తీసుకున్నారు' అని అందులో రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











