ఆ సినిమా స్ఫూర్తితోనే ఎఫ్ 2 తీశాను.. సీక్వెల్‌పై అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్
టాలీవుడ్‌లో అపజయమెరుగని దర్శకులు కొందరున్నారు. అందులో ముఖ్యంగా మొదటగా చెప్పుకోవాల్సింది రాజమౌళి. ఆ తరువాత కొరటాల శివ ఉంటాడు. తీసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమో లేదా ఇండస్ట్రీ హిట్ అవ్వడమో జరుగుతుంటుంది. ఇక వీరిద్దరూ టాప్ డైరెక్టర్స్.. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకులు. అయితే ఈ లిస్ట్‌లోకి అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్ వచ్చి చేరాడు.

ప్రతీ సినిమా హిట్టే..
అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా తీసినా సరే అది సూపర్ హిట్ అవుతుంది. అప్పటి వరకు ఆ హీరోలకు లేని రికార్డ్ కలెక్షన్లు కురిపిస్తాడు. అదే అనిల్ రావిపూడి స్పెషాల్టీ. అలా అనిల్ రావిపూడి ఇప్పటి వరకు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలను తెరెక్కించాడు. అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే.

ఇండస్ట్రీలో గుర్తింపు..
ఎఫ్ 2 చిత్రంతో అనిల్ రావిపూడి పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. ఆ సినిమా అంతటి హిట్ అవ్వడంతోనే మహేష్ బాబు చాన్స్ ఇచ్చాడు. అలా సరిలేరు నీకెవ్వరుతో అనిల్ స్థాయి పెరిగింది. అందుకే ఎఫ్ 2 సీక్వెల్‌గా రాబోతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ గురించి అనిల్ తాజాగా మాట్లాడుతూ ఆసక్తికరమైన అంశాలు చెప్పుకొచ్చాడు.

ఆ సినిమాయే స్ఫూర్తి..
ఎఫ్ 3 షూటింగ్ డిసెంబరు 14 నుంచి షెడ్యూల్ మొదలవుతుందని తెలిపాడు. కొత్తగా పెళ్లయిన జంట జీవితంలో జరిగే చిన్న చిన్న తమాషాలను కథగా అల్లానని... ఓ రకంగా చెప్పాలంటే `క్షేమంగా వెళ్లి - లాభంగా రండి` సినిమానే తనకు స్ఫూర్తి అని అసలు సంగతి చెప్పాడు. ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎక్కడెక్కడ, ఏ సన్నివేశాల్లో ఎలా రియాక్ట్ అయ్యారో తనకు తెలుసన్నాడు. కుటుంబ సమేతంగా చూసేలా ఓ కథ చెబుతూ, అందులో వినోదం జోడిస్తే, దానికి రీచ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే ఆ ఫార్ములాతోనే ఎఫ్ 2 తీశానని అన్నాడు.
Recommended Video

మూడో హీరో పాత్ర..
అయితే ఎఫ్ 3 సినిమాలో మరో స్టార్ హీరో నటించనున్నాడని ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. వాటిపై అనిల్ రావిపూడి స్పందించాడు. ఇప్పటి వరకు ఈ కథలో మూడో స్టార్ హీరోకి సరిపాడే పాత్ర రాలేదు.. బహూషా రాదేమో అని క్లారిటీ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











