గర్భంతో ఉన్నా వదలడం లేదా.. హీరోయిన్ అనిత ఘాటు ముద్దు.. ఇలా కూడా వాడేస్తున్నారా?
నువ్వు నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనిత. ఆ తరువాత తెలుగులో మరికొన్ని చిత్రాలను చేసింది కానీ అంతగా ఫేమస్ అవ్వలేదు. టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడా అలాంటి పరిస్థితే ఉండటంతో బుల్లితెరపై సెటిలైంది. నాగిని 4తో అనితకు మంచి పేరు వచ్చింది. అనితకు బుల్లితెరపై ప్రస్తుతం స్టార్ స్టేజ్ వచ్చేసింది. తాజాగా అనిత గర్భవతి అన్న విషయం మీడియాలో బాగా వైరల్ అయింది.

గర్భవతి అంటూ ప్రకటన..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనిత ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇందులో చాలా వరకు భర్త రోహిత్ రెడ్డిని ఆట పట్టించేవే ఉంటాయి. ఇద్దరూ కలిసి ముద్దులు పెట్టుకునే వీడియోలు, ఫోటోలు, విదేశాల్లో చక్కర్లు కొట్టే వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తాను గర్భం దాల్చాననే విషయాన్ని కూడా వెరైటీగా ప్రకటించింది.

తెలిసిన క్షణం నుంచి..
భార్య గర్భం దాల్చిందని తెలిసిన భర్తలు ఎంత సంతోషిస్తారో అందరికీ తెలిసిందే. భార్యకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ మహారాణిలా అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతారు. అలాగే తాము తల్లిదండ్రులం కాబోతోన్నామని తెలిసిన క్షణం నుంచి రోహిత్ ఎంతో బాగా చూసుకుంటున్నాడని అనిత చెప్పుకొచ్చింది.

అలా వాడేశారు..
గర్భంతో ఉన్న అనిత ఈ సందర్భాన్ని బాగానే వాడేశారు. గర్భంతో ఉన్నవారు పడుకునేందుకు మంచి బెడ్ ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఓ యాడ్ చేశారు. తన గురించి తన భర్త ఎంతో కేర్ తీసుకుంటున్నాడని, తన కోసం బాగా ఆలోచిస్తున్నాడని, అందుకే మంచి బెడ్‌ను దీపావళి గిఫ్ట్‌గా ఇచ్చాడని చెప్పుకొచ్చింది.
Recommended Video
లిప్ కిస్‌తో రచ్చ..
గర్భంతో ఉన్నా కూడా ఇలాంటి ప్రకటనలు తీసేవారు వదలకుండా బాగానే వాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇలాంటి సమయాల్లోనే న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటుందని ఇలాంటి ప్రకటనలను షూట్ చేస్తున్నారు. ఇక తనకు ఇలాంటి మంచి బహుమతి ఇచ్చినందకు భర్తకు ఘాటుగా ఓ ముద్దు పెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











