అనుష్కకు గాయాలు.. ఇంతకీ ఏమై ఉంటుంది?
స్వీటీ అనుష్కకు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. బాహుబలి లాంటి ఘన విజయం సాధించిన తరువాత.. వెనువెంటనే ప్రేక్షకులను పలకరించలేదు. భాగమతి చిత్రం వచ్చి రెండేళ్లు అవుతున్నా.. మరోసారి అభిమానులకు కనువిందు చేయలేకపోతోంది. ఎన్నో రోజుల నుంచి ఊరిస్తూ వస్తోన్న నిశ్శబ్దం చిత్ర పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదన్నట్టు మారింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూనే వచ్చింది. ఇది చాలదన్నట్టు.. కరోనా వచ్చి మొత్తం తలకిందులు చేసేసింది.
అనుష్క, మాధవన్ వంటి భారీ తారాగణంతో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, పోస్టర్స్‌తో ఆకట్టుకున్న నిశ్శబ్దం పూర్తి స్థాయి సినిమాగా మాత్రం రావడంలో తడబడుతూనే ఉంది.ఈ చిత్రం చుట్టూ ఎన్నో సమస్యలుఉండగా.. ఈ కరోనా కూడా వచ్చి చేరింది. దీంతో మొదటికే మోసం వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై నేరుగా విడుదల చేద్దామని చిత్రయూనిట్ భావించినట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఆ విషయంలో అనుష్క అసంతృప్తిగా ఉందని, ఆమెకు నిర్మాతలకు మధ్య గ్యాప్ వచ్చిందని రూమర్స్ వచ్చాయి. వెంటనే తేరుకున్న నిర్మాతలు.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చి రూమర్లకు చెక్ పెట్టేశారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్న అంజలి.. ఓ ఫోటోను షేర్ చేసింది. అది షూటింగ్ చివరి రోజు దిగిన ఫోటో అని తెలిపింది. అందులో అనుష్కకు గాయాలై ఉన్నాయి. ఆమెతో పాటు సుబ్బరాజుకు కూడా రక్తం కారినట్టు కనిపిస్తోంది. ఈ లెక్కన చివరి రోజు ఛేజింగ్, ఫైటింగ్ సీన్‌ను షూట్ చేసినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











