29 ఏళ్లకే విరాట్ కోహ్లితో వివాహం... అసలు కారణం చెప్పిన అనుష్క!
Recommended Video
అనుష్క శర్మ, విరాట్ కోహ్లి 2017తో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతకు ముందు నుంచే ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
అయితే అనుష్క కేవలం 29 సంవత్సరాల వయసులోనే పెళ్లాడటం అప్పట్లో చర్చనీయాశం అయింది. సాధారణంగా ఈ వయసులో నటీమణుల కెరీర్ పీక్ స్టేజీలో ఉంటుంది. ఆ సమయంలో ఎవరూ పెళ్లి ఆలోచన కూడా చేయరు. ఇటీవల ఫిల్మ్ ఫేర్ ఇంటర్వ్యూలో అనుష్క తాను 30 ఏళ్ల లోపే పెళ్లాడటం వెనక కారణం తెలిపారు.

ఆడియన్స్ అవేమీ పట్టించుకోరు
మన ఆడియన్స్ ఇండస్ట్రీకంటే ఎక్కువ డెవలప్ అయ్యారు. వారు నటీనటులను కేవలం తెరపై చూడటానికి మాత్రమే ఆసక్తి చూపుతారు. పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోరు. మీకు పెళ్లైనా, పిల్లలు ఉన్నా వారికి అనవసరం. మనం ఈ ఆలోచన నుంచి బయటపడాలి.... అని అనుష్క చెప్పుకొచ్చారు.

అందుకే 30 ఏళ్లలోపే విరాట్‌ను పెళ్లాడాను
‘29 సంవత్సరాలకే నేను పెళ్లి చేసుకున్నాను. నటీమణులు ఈ వయసులో పెళ్లాడటం చాలా అరుదు. కానీ నేను విరాట్‌తో ప్రేమలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. వివాహం అనేది సహజమైన ప్రక్రియే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఫిక్స్ అయ్యాను' అని అనుష్క తెలిపారు.

పెళ్లి వల్ల కెరీర్ దెబ్బతింటుందని అనుకోవద్దు
మగాళ్లు ఎలాంటి సందేహం లేకుండా పెళ్లి చేసుకుని తమ పని కొనసాగిస్తున్నారు. మహిళలు కూడా ఎందుకు అలా చేయకూడదు?... నటీమణులు అంతా పెళ్లి చేసుకుని తమ కెరీర్ కొనసాగిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. పెళ్లి వల్ల మన కెరీర్ దెబ్బతింటుంది అని అస్సలు ఆలోచించకూడదు... అని అనుష్క తెలిపారు.

విజయం లేదా ఓటమి రెండు శాశ్వతమైనవి కాదు
జీరో మూవీ ఫెయిల్యూర్ మీద స్పందిస్తూ... ‘‘విజయం లేదా ఓటమి రెండు శాశ్వతమైనవి కాదు. ఇవి రెండూ కూడా తాత్కాలికమైనవే. విజయం మీకు ఉపశమనం కలిగించినప్పటికీ, మీరు వైఫల్యంతో ఎక్కువగా నేర్చుకుంటారు, ఎదుగుతారు. ఒక వ్యక్తి విజయం సాధించిన తర్వాత వారు ప్రవర్తించే విధానం గురించి మీరు చాలా చెప్పగలరు. అదేవిధంగా, ఒక వ్యక్తి వైఫల్యం తర్వాత వారు ఎలా ప్రవర్తిస్తారో వారి బలం గురించి మీరు చాలా చెప్పగలరు.'' అన్నారు.


Click it and Unblock the Notifications











