అతడితో ఆ 21 రోజులే ఎంజాయ్ చేశా: పర్సనల్ లైఫ్‌పై అనుష్క షాకింగ్ కామెంట్స్
సినీ రంగానికి, క్రికెట్‌కు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలో ఈ రెండు రంగాలకు చెందిన వారికే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకు అనుగుణంగానే సినిమా రంగానికి చెందిన బ్యూటీలనే క్రికెటర్లు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కానీ, వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జంట ఒకటి. ఆ మధ్య ఒక్కటైన ఈ జంట.. ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తమ వైవాహిక జీవితం గురించి అనుష్క షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం.!

అక్కడే కలిశారు.. ఆ తర్వాత ఒక్కటయ్యారు
తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపును దక్కించుకుంది అనుష్క శర్మ. అదే సమయంలో కోహ్లీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి ఓ వ్యాపార ప్రకటనలో నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడిపోయారు. అప్పటి నుంచి రహస్యంగా ప్రేమాయణం సాగించిన ఈ జంట... కొన్ని నెలల క్రితం అగ్నిసాక్షిగా ఒకటైంది.

ఇద్దరూ ఫుల్ బిజీ.. అందుకే భారీ స్పందన
వరుస సినిమాలతో అనుష్క శర్మ... బిజీ షెడ్యూల్‌తో విరాట్ కోహ్లీ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. అయినప్పటికీ.. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తమ కెరీర్లకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలనూ పంచుకుంటున్నారు. అదే సమయంలో తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. వాటికి భారీ స్పందన వస్తోంది.

విరాట్ వల్ల అనుష్కకు తప్పని విమర్శలు
ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడన్న విషయం తెలిసిందే. తన సక్సెస్‌కు అనుష్క శర్మ ప్రోత్సాహం కూడా కారణమని అతడు ఎన్నోసార్లు వెల్లడించాడు. అయితే, విరాట్ ఫెయిల్యూర్ అయన సందర్భాల్లో మాత్రం చాలా మంది అనుష్కనే విమర్శించారు. ఆమె కారణంగా సరిగా ఆడలేకపోతున్నాడని పలువురు వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

తల్లి కాబోతున్న అనుష్క.. క్లారిటీ ఇచ్చింది
వరుస హిట్లతో దూసుకుపోతున్నప్పటికీ... కొన్ని రోజులుగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటోంది. దీంతో ఆమె తల్లి కాబోతుందని బీ టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె స్వయంగా స్పందించింది. ‘నేను సినిమాలు చేయట్లేదంటే.. తల్లినవుతున్నా అని కాదు. నచ్చిన కథలు రాలేదని. అయినా పిల్లల్ని ఎప్పుడు కనాలో నాకు తెలుసు' అని ఫైర్ అయింది.

పర్సనల్ లైఫ్‌పై అనుష్క షాకింగ్ కామెంట్స్
అనుష్క గత ఏడాది ‘జీరో' అనే మూవీ చేసింది. దాని తర్వాత ఆమె ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో నటించనుంది. లాక్‌డౌన్ కారణంగా ఆ మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్‌పై అనుష్క షాకింగ్ కామెంట్స్ చేసింది.
Recommended Video

విరాట్ కోహ్లీతో ఆ 21 రోజులే ఎంజాయ్ చేశా
‘లాక్‌డౌన్ కారణంగా కోహ్లీతో గడపడానికి ఎక్కువ సమయం దొరికింది. దీనిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు' అని ఓ నెటిజన్ అనుష్కను ప్రశ్నించాడు. దీనికి ‘వాస్తవానికి వివాహం అయిన ఆరు నెలల్లో కేవలం 21 రోజులు మాత్రమే కలిసున్నాం. దీనికి కారణం మేమిద్దరం బిజీగా ఉండడమే. ఇప్పుడు మాత్రం చాలా రోజులు కలిసున్నాం. సో.. చాలా హ్యాపీ' అంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











