Ind Vs NZ చరిత్ర సృష్టించిన విరాట్ కొహ్లీ .. భర్త సెంచరీ చేయగానే అనుష్క శర్మ ఏం చేసిందో తెలుసా?
వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పరుగులు వరద పారింది. భారతీయ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించారు. దాంతో న్యూజిలాండ్ ముందు ఇండియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడమే కాకుండా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీల్లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించిన వెంటనే బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే..
ఫస్ట్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొన్నది. తొలి ఓవర్ నుంచి భారత బ్యాట్స్‌మెన్లు భారీగా పరులుగు సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్లు, ఫోర్లు సాధించి స్కోరును పరుగులు పెట్టించారు. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డుపై పరుగుల వేగాన్ని కొనసాగించాడు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న విధానం చూసి సెంచరీ సాధిస్తాడనే నమ్మకంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అలాగే సచిన్ టెండూల్కర్ సాధించిన 49 సెంచరీలను అధిగమిస్తాడా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. అభిమానులు ఆశల్ని, అంచనాలను వమ్ము చేయకుండా తన కెరీర్‌లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ 113 బంతులు ఆడి 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 117 పరుగులు చేశాడు.

తన భర్త విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే అనుష్క శర్మ ఆనందంలో మునిగిపోయింది. చప్పట్లు కొడుతూ భావోద్వేగానికి గురైంది. సెంచరీ చేసిన అనంతరం ప్రేక్షకులకు, అభిమానులకు అభివాదం చేస్తుండగా.. అనుష్క ఫ్లయింగ్ కిసెస్ గాలిలో వదిలింది. పదే పదే ముద్దులు కురిపించి తన ఆనందాన్ని, ప్రేమను కురిపించింది.
విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే తన బ్యాట్ గాలిలో ఊపుతో సచిన్ టెండూల్కర్‌కు మర్యాదపూర్వకంగా, గౌరవంగా అభివాదం చేశాడు. అనంతరం తన భార్య అనుష్క శర్మకు ఫ్లయింట్ కిసెస్ ఇచ్చారు. దాంతో స్టేడియం మొత్తం కేరింతలతో హోరెత్తింది. వన్డే ఇంటర్నేషనల్ పోటీల్లో సెంచరీ చేయడంతో విరాట్ కోహ్లి సరికోత్త చరిత్రను సృష్టించాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ తన ఇన్నింగ్స్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 397 పరుగులు చేసిన ఇండియా.. తన ప్రత్యర్థి జట్టు కివీస్ ముందు 398 భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 105 సరుగులుతో సెంచరీ, శుభ్‌మన్ గిల్ 80 పరుగులు చేయడం విశేషంగా మారింది. ఈ మ్యాచ్‌కు ఫుట్‌బాల్ లెజెండ్ బెక్‌హమ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











