15 Years of Arundhati జేజమ్మకు 15 ఏళ్లు.. 13 కోట్ల బడ్జెట్.. అరుంధతికి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తొలిసారి నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 16వ తేదీకి 15 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా గురించి స్వీటీ పోస్టు చేసిన విషయం వైరల్‌గా మారింది. ఈ సినిమా విశేషాలు, వివరాల్లోకి వెళితే..
చంద్రముఖి సినిమా చూసిన తర్వాత నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డికి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే అరుంధతి. ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్‌కు అనుష్క శెట్టి అయితే బాగుంటుందనే జెమిని కిరణ్ సలహాతో కథానాయిక వేటకు నిర్మాత ముగింపు పలికారు. అరుంధతి పాత్ర గురించి చెప్పగానే అనుష్క ఒప్పేసుకొన్నది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలో సోను సూద్ నటనను చూసి పశుపతి పాత్రను ఇచ్చారు.

అనుష్క శెట్టి నటించిన అరుంధతి సినిమాను సుమారుగా 13.5 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో నిర్మించారు. తొలి ఆట నుంచే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల ప్రభంజనం కొనసాగింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడంతో రికార్డు కలెక్షన్లు సాధించింది.
తెలుగు సినిమా పరిశ్రమలో 2009 సంవత్సరంలో రిలీజైన అరుంధతి చిత్రం ఆ సంవత్సరంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయంతో అనుష్క స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమెను జేజమ్మగా పిలవడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా వచ్చేంత వరకు అరుంధతి ఇమేజ్ ఆమెను వెంటాడింది.

అరుంధతి చిత్రం 13 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. నైజాంలో ఈ సినిమా 11.35 కోట్ల షేర్, ఆంధ్రాలో 24.5 కోట్ల షేర్ సాధించడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా 35.86 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళ, మలయాళంలో కలిపి మొత్తంగా 43 కోట్లకుపైగా షేర్, 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అరుంధతి సినిమా 15 ఏళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో అనుష్క శెట్టి ఎమోషనల్ అయ్యారు. జేజేమ్మ క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని స్థానాన్ని ఇచ్చింది. ఇలాంటి ఆఫర్ ఇచ్చిన కోడి రామకృష్ణ గారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్. ఇండియన్ సినిమా రంగంలో ఎపిక్ మూవీగా మార్చిన టీమ్‌కు ధన్యవాదాలు అని అనుష్క ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











