ఆ డైరెక్టర్‌ను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన అనుష్క.. చాలా మిస్ అవుతున్నానంటూ కన్నీటి పర్యంతం

By Manoj

అనుష్క శెట్టి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరిది. అక్కినేని నాగార్జున నటించిన 'సూపర్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంది. అందంతో పాటు చక్కని అభినయం కనబరిచే హీరోయిన్ కావడంతో స్టార్ హీరోల సరసన ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఈ నేపథ్యంలో అనుష్క తాజాగా ఓ డైరెక్టర్‌ను చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆయనను మిస్ అవుతున్నానంటూ కన్నీరు పెట్టుకుంది. ఆ వివరాలు మీకోసం.!

వాళ్లంతా ఫిదా.. టాప్ లేపిన హీరోయిన్

వాళ్లంతా ఫిదా.. టాప్ లేపిన హీరోయిన్

అనుష్క కెరీర్ ఆరంభంలోనే ఎన్నో మంచి అవకాశాలు దక్కించుకుంది. మొదట ఆమె గ్లామర్ పాత్రలకే పరిమితం అయినప్పటికీ.. ఆ తర్వాత పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటించింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు ఫిల్మ్ మేకర్లు కూడా ఫిదా అయిపోయారు. దీంతో తెలుగులోని దాదాపు అందరు హీరోలతో నటించి టాప్ హీరోయిన్ అయిపోయింది.

అనుష్క అంటే అందరికీ తెలిసింది అప్పుడే

అనుష్క అంటే అందరికీ తెలిసింది అప్పుడే

కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుష్క.. సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి' అనే మూవీలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెలోని అద్భుత నటిని తెలుగు వారికి పరిచయం చేసింది. దీంతో ఎన్నో అవార్డులు అనుష్క సొంతం అయ్యాయి. ఈ మూవీతోనే ఆమె గురించి అందరికీ తెలిసింది.

ఆ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిపోయింది

ఆ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిపోయింది

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'తో అనుష్క వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఇందులో ఆమె చేసిన దేవసేన పాత్ర ఎంతో హైలైట్ అయింది. రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించిన ఆమె మెప్పించిందనే చెప్పాలి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

 ప్రయోగం విఫలం... అనుష్కకు కొత్త కష్టం

ప్రయోగం విఫలం... అనుష్కకు కొత్త కష్టం

బాహుబలి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అనుష్క.. ‘సైజ్ జీరో' అనే సినిమాలో నటించింది. ఇందులో లావు ఉన్న అమ్మాయిగా కనిపించేందుకు ఆమె భారీగా బరువు పెరిగింది. అప్పటి నుంచి అనుష్కకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా అప్పటి నుంచి ఆమె సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు.

నిశ్శబ్దంగా పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది

ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ అంజలి కీలక పాత్ర చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క పాత్ర కొత్తగా ఉంటుందని అంటున్నారు.

Recommended Video

Anushka Gets Emotional On The Sets, Reason Behind Anushka's Public Breakdown
ఆ డైరెక్టర్‌ను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన అనుష్క

ఆ డైరెక్టర్‌ను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన అనుష్క

తాజాగా అనుష్క ‘క్యాష్' ప్రోగ్రామ్‌కు వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రసారం చేసిన ఏవీలో కోడి రామకృష్ణ ఫొటో కనిపించగానే ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. దీనికి వివరణ ఇస్తూ ‘ఆయనతో నాకు మంచి రిలేషన్ ఉంది. నేను చాలా మిస్ అవుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా' అంటూ కన్నీటి పర్యంతం అయింది స్వీటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X