టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు? అత్యధికంగా పారితోషికం ఎవరిదంటే!

సినిమా ఇండస్ట్రీలో ఒకట్రెండు హిట్లు పడ్డాయంటే చాలు కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకెళ్తుంది. ప్రస్తుతం అత్యధికంగా పారితోషికం తీసుకొంటున్న తారల్లో నయనతార, అనుష్క శెట్టి, సమంత అక్కినేని, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ లాంటి తారల పేర్లు వినిపిస్తాయి. వీరిలో నయన్, సమంత, అనుష్క, కాజల్ అంతా సీనియర్లే.. కానీ ఇటీవల హిట్లలో దూసుకొచ్చిన తారల్లో రష్మిక మందన్న టాప్‌లో ఉంటారు. అయితే ఈ హీరోయిన్లు తీసుకొనే రెమ్యునరేషన్లు ఏ రేంజ్‌లో ఉంటాయనే ప్రస్తుతం ఫిలింనగర్‌లో చర్చ జరుగుతున్నది. టాలీవుడ్‌లో ఏ హీరోయిన్ ఎక్కువగా తీసుకొంటారంటే..

సమంత రెమ్యునరేషన్ ఎంతంటే

సమంత రెమ్యునరేషన్ ఎంతంటే

గత రెండేళ్లుగా సమంత వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. రంగస్థలం, అభిమన్యుడు, హే బేబి, సూపర్ డీలక్స్ లాంటి చిత్రాల్లో నటన పరంగా మెప్పించింది. ఇక హే బేబీ, యూటర్న్ చిత్రాలను స్వయంగా తన భుజాలపై మోసింది. ఇలా కెరీర్‌లో టాప్‌ గేర్‌లో ఉన్న సమంత రెమ్యునరేషన్ రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు తీసుకొంటున్నదనే ఇండస్ట్రీ టాక్.

నయనతార ఏ రేంజ్‌లో తీసుకొంటుందంటే..

నయనతార ఏ రేంజ్‌లో తీసుకొంటుందంటే..

ఇక సైరా లాంటి తెలుగు సినిమాతో, అలాగే తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో నయనతార తన స్టామినాను బాక్సాఫీస్ వద్ద గట్టిగా చూపిస్తున్నది. ప్రస్తుతం అగ్రహీరోల సినిమాలను అంగీకరించడం లేదా సొంతంగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేయడమే ప్లాన్‌గా నయన పెట్టుకొన్నది. ఇలాంటి నయనతార పారితోషికంగా రూ.2 కోట్లకంటే తక్కువే అని వినిపిస్తున్నది.

టాప్ రేంజ్‌లోకి రష్మిక మందన్న

టాప్ రేంజ్‌లోకి రష్మిక మందన్న

ఛలో టాలీవుడ్ కెరీర్ ఆరంభించి.. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, తాజాగా భీష్మతో రష్మిక టాప్ హీరోయిన్‌గా ముద్ర వేసుకొన్నది. చేతిలో కనీసం అరడజనకు పైగా సినిమాలు చేతిలో ఉన్నాయనేది ప్రస్తుతం ఓ మాట వినిపిస్తున్నది. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ మూవీలో రష్మిక ఆఫర్‌ను దక్కించుకొన్నది. అలాగే సరిలేరు తర్వాత తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్టు స్వయంగా ఆమె ఒప్పుకొన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్మిక రెమ్యునరేషన్ 2 కోట్ల రూపాయల దరిదాపుల్లో ఉండొచ్చు అనే మాట వినిపిస్తున్నది.

కాజల్ అగర్వాల్ రేంజ్ ఎంత

కాజల్ అగర్వాల్ రేంజ్ ఎంత

ఇక కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఫేమ్‌లో ఉన్నప్పటికీ.. తాను స్వయంగా సినిమాను గట్టెక్కించే స్టామినాను సంపాదించుకోలేకపోయారు. పది నుంచి 15 రోజుల కాల్షిట్‌ ఇచ్చి ఒక్కో సినిమాకు రూ.1 కోటి వరకు తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది. మెహ్రీన్ లాంటి యువ హీరోలు కోటి కంటే తక్కువే తీసుకొంటున్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Recommended Video

Samantha Hot Pic Goes Viral || Akkineni Fans Furious On Samantha
అనుష్క శెట్టిదే టాప్ రెమ్యునరేషనా?

అనుష్క శెట్టిదే టాప్ రెమ్యునరేషనా?

ఇక ఇండస్ట్రీలో వరుస సినిమాలు లేకపోయినా.. అందరి చూపు అనుష్క మీదే ఉంది. బాహుబలి తర్వాత అనుష్క రేంజ్ నేషనల్ వైడ్‌గా పెరిగింది. భాగమతితో సోలో హీరోయిన్‌గా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. ఆ సినిమాతో సింగిల్ రూ.50 కోట్ల వసూళ్లను దాటించింది. తాజాగా అనుష్క నిశ్శబ్దం అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమాకు అత్యధికంగా 2.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొన్నట్టు సమాచారం. దీంతో అనుష్కనే ఇప్పటికీ టాప్ రెమ్యునరేషన్ తీసుకొన్న హీరోయిన్ అనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X