షాకింగ్: రీఎంట్రీపై పవన్ కల్యాణ్ పునరాలోచన.. ఆ సీఎం తీసుకున్న నిర్ణయమే కారణం.!

By Manoj Kumar P

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. ఎన్నో సరికొత్త ప్రయత్నాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా పవన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

ఇదే, రాజకీయాల్లోనూ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పవర్ స్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే, తాజాగా ఆయన ఈ విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఓ సీఎం అని అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది.? వివరాల్లోకి వెళితే...

 పవన్ చెప్పలేదు.. ఆయన మాత్రం ప్రకటించాడు

పవన్ చెప్పలేదు.. ఆయన మాత్రం ప్రకటించాడు

పవన్ కల్యాణ్ చాలా కాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజు చాలా సందర్భాల్లో పవన్ రీఎంట్రీని ప్రకటించడమే. అయితే, ఈ విషయంపై పవన్ కల్యాన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

దర్శకుడు.. టైటిల్.. బడ్జెట్ అన్నీ ఫైనల్

దర్శకుడు.. టైటిల్.. బడ్జెట్ అన్నీ ఫైనల్

బాలీవుడ్‌లో బంపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పింక్' సినిమా తెలుగు రీమేక్ ద్వారా పవన్ రీఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ఈ సినిమాకు ‘లాయర్ సాబ్' అనే టైటిల్ అనుకుంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా బడ్జెట్ కూడా ఫైనల్ అయిందని ప్రచారం జరుగుతోంది. దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ దీన్ని నిర్మిస్తున్నారు.

 పవన్ కల్యాణ్ కండీషన్స్.. రికార్డు క్రియేట్

పవన్ కల్యాణ్ కండీషన్స్.. రికార్డు క్రియేట్

ఈ సినిమాలో నటించేందుకు గానూ పవన్ కల్యాణ్ నిర్మాత దిల్ రాజుకు కొన్ని కండీషన్స్ పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. షూటింగ్‌కు తాను ఎన్ని రోజులు అందుబాటులో ఉంటాననే విషయం ముందే చెప్పారట. అలాగే, రెమ్యూనరేషన్ కూడా ఇప్పటికే ఫైనల్ అయిందని అంటున్నారు. మొత్తంగా ఈ మూవీకి పవన్ రూ. 50 కోట్లకు పైగా చార్జ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

వాళ్లను ఫైనల్ చేశారు.. పవన్ లుక్ ఇలా

వాళ్లను ఫైనల్ చేశారు.. పవన్ లుక్ ఇలా

‘పింక్' సినిమాలో వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతుల కథను చూపించారు. అందులో తాప్సీ, ఆండ్రియా, క్రితీ నటించిన పాత్రలకు తెలుగులో నివేదా థామస్, అంజలి, అనన్యను ఫైనల్ చేశారని అంటున్నారు. అలాగే, ఈ సినిమాలో పవన్ నేచురల్ లుక్‌లోనే కనిపించబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిందని టాక్.

రీఎంట్రీపై పవన్ కల్యాణ్ పునరాలోచన

రీఎంట్రీపై పవన్ కల్యాణ్ పునరాలోచన

వాస్తవానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ముగిశాయి. దీంతో సినిమా కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని అనుకున్నారు. అయితే, దిల్ రాజుకు సంబంధించిన రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదల అవుతున్న నేపథ్యంలో పండుగ తర్వాత షూటింగ్ మొదలు పెడతారని అన్నారు. తాజాగా దీనిపై పవన్ పునరాలోచనలో పడ్డట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.

కారణం ఆ సీఎం తీసుకున్న నిర్ణయమే.!

కారణం ఆ సీఎం తీసుకున్న నిర్ణయమే.!

ఈ నెల 20 నుంచి ‘పింక్' రీమేక్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిద్దామని పవన్.. దిల్ రాజుతో చెప్పారట. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయం వల్ల పవన్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ కొద్ది రోజులు వాయిదా వేయాలని దిల్ రాజును కోరినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X