twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువ తారకు చేదు అనుభవం... వల్గర్ కామెంట్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్

    |

    సోషల్ మీడియాలో అంటే అన్ని రకాల వర్గాలు, అన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయి. మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఒక్కోసారి చెడు మోతాదే ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి వారితో సాధారణ జనానికి ఎలాంటి ఇబ్బంది కలగపోయినా.. సెలెబ్రిటీలకు మాత్రం పెద్ద తలనొప్పిని తీసుకొస్తారు. చూసీ చూడకుండా వదిలిస్తే మరింత రెచ్చిపోతారు. అందుకే అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఓ నటి నడుం బిగించింది. ఆ కథ ఏంటో ఓసారి చూద్దాం.

     అపర్ణ నాయర్‌పై కామెంట్స్..

    అపర్ణ నాయర్‌పై కామెంట్స్..

    మళయాలి బ్యూటీ అపర్ణ నాయర్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా అప్‌డేట్స్, పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. అయితే ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్‌పై ఇటీవలె కొన్ని అభ్యంతరకర కామెంట్స్ వచ్చాయి. వాటిపై అపర్ణ ఫైర్ అయింది.

    ప్రైవేట్ పార్ట్స్‌పై..

    ప్రైవేట్ పార్ట్స్‌పై..

    అపర్ణ నాయర్ పోస్ట్‌కు సదరు నెటిజన్ స్పందిస్తూ.. ఐ లవ్యూ.. ఐ లవ్ యువర్ *** అని కామెంట్స్ చేశాడు. దీంతో ఆ కామెంట్‌ను గుర్తించిన అపర్ణ.. ఆయన హిస్టరీని బయటకు తీసింది. దీంతో పాటు ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను చేసింది.

    కూతురుని ఎత్తుకుని..

    కూతురుని ఎత్తుకుని..

    ఐ లవ్‌ యూ చెప్పిన అజిత్‌ కుమార్‌ ప్రొఫైల్‌ చెక్‌ చేస్తే అతడికి ఒక కుమార్తె ఉందని అర్థమైందని ఆమె తెలిపింది. అతడు తన కుమార్తెను ప్రేమగా హగ్‌ చేసుకున్న ఓ ఫొటో చూశానని, అదే విధంగా తాను కూడా ప్రేమగా తన హృదయానికి హత్తుకున్న ఓ తండ్రికి కుమార్తెనేనని చెప్పింది.

     వదిలే ప్రసక్తే లేదు..

    వదిలే ప్రసక్తే లేదు..

    అయితే ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఇలాంటి వాటిని వదిలేయకూడదని తెలిపింది. ఇలా కామెంట్లు చేసే వారిని క్షమిస్తే అందరూ అలానే ప్రవర్తిస్తారని తెలిపింది. మాటలతో గానీ, ఎమోషనల్‌గా గానీ, భౌతికంగా గానీ మహిళలను హింసించిన వారిని వదిలకూడదని పేర్కొంది.

    English summary
    Aparna Nair Fires On Netizens Vulgar Comments. My heartfelt gratitude to each and everyone who stood up for me! I have moved legally against him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X