Just In
- 51 min ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి
- 2 hrs ago
ప్రియుడి పేరును బయట పెట్టిన యాంకర్ శ్రీముఖి: తన క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ
- 12 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
Don't Miss!
- Finance
టెలికం స్పెక్ట్రం వేలం, అంచనాలకు మించి భారీగా బిడ్స్: పోటీలో ఈ కంపెనీలు
- News
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి: తెలంగాణలో ఎన్ని కేంద్రాల్లో టీకా
- Sports
విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు..తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి! ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలను దాటేసి!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లికి సిద్ధమైన ఆరియానా గ్లోరీ: ఏకంగా అలా కనిపించి.. అతడితో కలిసి షాకిచ్చిన బోల్డ్ బ్యూటీ
ఆరియానా గ్లోరీ.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. దీనికి కారణం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనడమే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదేళ్ల క్రితమే యాంకర్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ వల్ల ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. బయటకు వచ్చిన తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తోన్న ఈ భామ.. తాజాగా షాకింగ్ ఫొటోలను బయట పెట్టింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

యాంకర్‌గా మొదలు.. ఆర్జీవీ వల్ల పాపులర్
నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నాలు జరిపినా వర్కౌట్ కాకపోవడంతో.. ఆరియానా గ్లోరీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసింది. అందులో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన చిట్ చాట్‌తో విపరీతంగా ఫేమస్ అయింది. అతడి వల్లే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయిందీ భామ.

బిగ్ బాస్ ఎంట్రీ... అందరి దృష్టిలో పడిందిగా
ఆర్జీవీ దెబ్బతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది ఆరియానా. అనతి కాలంలోనే వచ్చిన క్రేజ్ కారణంగా ఆమెకు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో నాలుగో సీజన్‌లో సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి ఆరియానా సీక్రెట్ రూమ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచే తన మార్క్ చూపిస్తూ అందరి దృష్టిలో పడిపోయింది.

పేరుకు తగ్గట్లే దూకుడు... చివర్లో నిరాశతోనే
నేను బోల్డ్ అని చెప్పుకున్న ఆరియానా.. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేసింది. టాస్కులను తాను గెలవడం కోసం ఎంతటి పనైనా చేసే ఆమె.. ఎన్నోసార్లు స్వార్ధంగా ఆడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంది. అద్భుతమైన ఆటతీరుతో ఎన్నోసార్లు నామినేషన్‌లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకని ఫినాలేకు చేరింది. కానీ, చివర్లో నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

అతడితో లవ్ ట్రాక్... మరికొరి పేరును చెప్పి
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ ఎక్కువగా జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌తోనే చనువుగా ఉండేది. అతడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూనే కనిపించేది. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో తాను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు చెప్పి షాకిచ్చిందీ బ్యూటీ. వినీత్ అనే వ్యక్తి ఎంట్రీతో అతడే లవర్ అనుకున్నారు.

ఎన్నారైతో పెళ్లి.. ముగ్గురు పిల్లలు కంటాను
ఆరియానా గ్లోరీ అమెరికాలో స్థిరపడిన ఎన్నారైను పెళ్లి చేసుకోబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు ఎన్నారై సంబంధం వచ్చిందని చెప్పడమే. అంతేకాదు, త్వరగా పెళ్లి చేసుకుంటానని.. ముగ్గురు పిల్లలను కూడా కనాలని అనుకుంటున్నానని ఆమె పలుమార్లు చెప్పింది. దీంతో ఆరియానా ఇంటర్వ్యూలో ట్రెండ్ అయ్యాయి.

పెళ్లికి సిద్ధమైన ఆరియానా.. అలా కనిపించి
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆరియానా గ్లోరీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె పెళ్లి కూతురు గెటప్‌లో ఉండడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే, ఇది ఓ సినిమా షూటింగ్‌లో భాగం మాత్రమే. సుధీర్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ సందర్భంగానే దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.

మెగా హీరోతో కలిసి షాకిచ్చిన బోల్డ్ బ్యూటీ
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలతో పాటు రాజ్ తరుణ్ సినిమాలో కూడా నటించింది. ఇక, ఇప్పుడు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో అతడితో పాటు యూనిట్ మొత్తంతో దిగిన ఫొటోను కూడా షేర్ చేసిందీ బోల్డ్ బ్యూటీ.