మెగా ఆఫర్ పట్టేసిన ఆరియానా: ఏకంగా ఆ హీరో సినిమాలోనే అలా.. షాకింగ్ లుక్‌తో బోల్డ్ బ్యూటీ!
తెలుగు బుల్లితెరపై ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ.. టాప్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఐదేళ్లుగా టెలివిజన్ రంగంలో ప్రభావాన్ని చూపుతోన్న ఈ షో.. ఎంతో మందిని బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. అలాంటి వారిలో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యాంకర్‌గా చాలా తక్కువ మందికే తెలిసిన ఈ అమ్మాయి.. బిగ్ బాస్ వల్ల రెండు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఇక, షో తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న ఆరియానా.. తాజాగా మెగా హీరో సినిమాలో ఆఫర్ పట్టేసింది. ఇంతకీ ఎవరా హీరో.? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

సాధారణ యాంకర్.. ఆయన వల్ల పాపులర్
యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసి పేరు సంపాదించుకుంది. ఇలా కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన చిట్ చాట్‌తో విపరీతంగా ఫేమస్ అయింది. అతడి వల్లే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయిందీ బోల్డ్ బ్యూటీ.

బిగ్ బాస్‌కు ఎంపిక.. మార్క్ చూపిస్తూ సత్తా
రాంగోపాల్ వర్మ.. ఆరియానా గురించి ట్వీట్లు చేయడంతో ఈ యాంకర్‌కు ఎనలేని క్రేజ్ వచ్చేసింది. తద్వారా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో గత ఏడాది ప్రసారం అయిన నాలుగో సీజన్‌లో సోహెల్‌తో కలిసి ఆరియానా సీక్రెట్ రూమ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచే తన మార్క్ చూపిస్తూ అందరి దృష్టిలో పడిపోయింది.

టాస్క్ కోసం ఎంతకైనా.. చివరికి మాత్రం షాక్
'నేను బోల్డ్ అమ్మాయిని. దేన్నైనా సాధించాలంటే వంద శాతం శ్రమిస్తా' అంటూ షోలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో చెప్పింది ఆరియానా. అందుకు అనుగుణంగానే టాస్కుల్లో గెలవడం కోసం ఎంతటి పనైనా చేసేది. ఇక అద్భుతమైన ఆటతీరుతో ఎన్నోసార్లు నామినేషన్‌లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకని ఫినాలేకు చేరింది. కానీ, చివర్లో ఊహించని విధంగా నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

బిగ్ బాస్ వల్ల భారీగా... అన్ని రకాల లాభం
బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆరియానా గ్లోరీ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇక, షోలో ఉన్నందుకు గానూ పేరుతో పాటు రూ. 25 లక్షల వరకూ రెమ్యూనరేషన్ వచ్చింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కొత్త యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించింది.

అతడితో కలిసి ఆ షోలో.. రచ్చ చేసేస్తుందిగా
బిగ్ బాస్ షోలో జంటగా కనిపించారు ఆరియానా గ్లోరీ.. ముక్కు అవినాష్. దీంతో వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ కూడా వినిపించింది. ఇక, బిగ్ బాస్ తర్వాత ఇద్దరూ వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్'లో కలిసి స్కిట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ షోకు వచ్చిన సోహెల్‌తో రొమాన్స్ చేసింది.

ఆ హీరోతో అయిపోయింది.. మెగా హీరోతోనూ
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలతో పాటు రాజ్ తరుణ్ సినిమాలో కూడా నటించింది. ఇక, ఇప్పుడు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో అతడితో పాటు యూనిట్ మొత్తంతో దిగిన ఫొటోను కూడా ఇటీవల షేర్ చేసిందామె.

షాకింగ్ లుక్‌తో బోల్డ్ బ్యూటీ... ఫొటో వైరల్
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న కొత్త సినిమాలో ఆరియానా గ్లోరీ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా హీరో సోదరిగా అని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించబోతుందట. దీనికి సంబంధించిన ఫొటోనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాపై ఆరియానా బోలెడు ఆశలు పెట్టుకుందట.


Click it and Unblock the Notifications











