నా రక్తంలో అలాంటి లోపం.. ప్లీజ్ నాకు సహాయం చేయండి.. మెహబూబ్, సోహైల్‌కు అరియానా రిక్వెస్ట్

బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోతో వెలుగులోకి వచ్చిన కంటెస్టెంట్లలో అరియానా గ్లోరి ఒకరు. యూట్యూబర్‌ నుంచి ఏకంగా సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకొన్నారు. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ లైవ్‌లో కొన్ని విషయాలు పంచుకొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు మెహబూబ్ దిల్ సే, సయ్యద్ సోహైల్ ర్యాన్‌తో ముచ్చటిస్తూ తన విషయాలు పంచుకొంటూ...

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet క్రేజ్ నిలుపుకుంటాడా? బిగ్ బాస్ వల్ల ఆ విజేతలకు ఒరిగింది ఏమిటి ?
కొత్త ఇంట్లోకి అరియానా గ్లోరి

కొత్త ఇంట్లోకి అరియానా గ్లోరి

ఇటీవలే నేను కొత్త ఇంటిలోకి మారాను. మణికొండకు నా ఇంటిని షిఫ్ట్ చేశాను. ఇల్లు మారిన సమయంలో నాకు చాలా భయం వేసింది. 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయించుకోవవచ్చు అంటే నేను వ్యాక్సిన్ తీసుకొన్నాను. ఇక నాకు భయం లేదు. ఈ సందర్భంగా ఒకటే చెబుతున్నాను. వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత 60 రోజుల వరకు బ్లడ్ డొనేట్ చేయలేరు. కాబట్టి ఎవరైనా బలంగా ఉన్న వాళ్లు.. హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా ఉన్న వాళ్లు బ్లడ్ డొనేట్ చేసి వ్యాక్సిన్ తీసుకోండి అంటూ అరియానా గ్లోరి తన ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో వెల్లడించారు.

బ్లడ్ డొనేషన్ చేయాలని ఉంది.. కానీ

బ్లడ్ డొనేషన్ చేయాలని ఉంది.. కానీ

నేను కూడా బ్లడ్ డోనేషన్ చేయాలని ఉంది. కానీ నేను ఇప్పుడు చేయలేను. ఎందుకంటే నా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువ. అందుకే నేను బ్లడ్ డొనేట్ చేయలేను. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం, ప్లాస్మా దానం చాలా అత్యవసరం. కాబట్టి అందరూ వీలైనంత వరకు తమ ఆరోగ్యాన్ని దష్టిలో ఉంచుకొని రక్తాన్ని దానం చేయండి అంటూ అరియానా గ్లోరి రిక్వెస్ట్ చేసింది.

నాకు చెప్పకుండానే వచ్చావా?

నాకు చెప్పకుండానే వచ్చావా?

లైవ్‌లోకి వచ్చిన మోహబూబ్‌తో అరియానా ముచ్చటిస్తూ.. నేను మణికొండకు వచ్చేశాను అంటూ చెప్పింది. నాకు చెప్పకుండానే మణికొండకు వచ్చావు... నాకు సోహైల్ చెప్పాడు అంటూ మెహబూబ్ అన్నాడు. ఈ సందర్భంగా అరియానాతో మాట్లాడుతూ... రంజాన్‌కు ఎలాంటి స్పెషల్ ఏమీ లేదు. సింపుల్‌గా చేసుకొన్నాను అని మెహబూబ్ దిల్‌సే చెప్పాడు.

అరియానా కోరిక మేరకు మెహబూబ్ దిల్ సే

అరియానా కోరిక మేరకు మెహబూబ్ దిల్ సే

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన కల్పించేందుకు ఓ మెసేజ్ ఇవ్వమని మెహబూబ్ దిల్ సే‌ను కోరింది. ప్రస్తుతం బయట పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి ప్రతీ ఒక్కరు బ్లడ్ డోనేషన్ చేయండి. చాలా మంది మాస్క్ ధరించకుండా తిరుగుతున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వేవ్‌లో పిల్లలకు డేంజర్ అని చెబుతున్నారు. కాబట్టి ఇమ్యునిటీ పెంచుకొండి అంటూ మెహబూబ్ తెలిపారు.

అరియానా రిక్వెస్ట్‌కు సయ్యద్ సోహైల్ స్పందన

అరియానా రిక్వెస్ట్‌కు సయ్యద్ సోహైల్ స్పందన

ఆ తర్వాత లైవ్‌లోకి సయ్యద్ సోహైల్ ర్యాన్ వచ్చాడు. ఈ సందర్భంగా అరియానా కోరిక మేరకు బ్లడ్ డోనేషన్‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాడు. అరియానా కోరిక మేరకు బ్లడ్ డోనేషన్ చేయండి. ఇతరులకు సహాయం చేసి ప్రాణాలు కాపాడండి అంటూ సోహైల్ ఇన్స్‌టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేశాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని లైవ్ సందర్భంగా కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X