అర్జున్ సర్జా కూతురు వివాహం.. ఐశ్వర్య అర్జున్ భర్త ఎవరో తెలుసా?
ప్రముఖ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య, హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా, తాజాగా ఈ లవ్ బర్డ్స్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు బయటకొచ్చిన వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఐశ్వర్య, ఉమాపతిల పెళ్లి ఫోటోలపై ఓ లుక్కేద్దాం పదండి.
నటుడు అర్జున్‌ని తమిళ సినీ అభిమానులు యాక్షన్ కింగ్‌గా పిలుచుకుంటారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆయన ఎన్నో హిట్ సినిమాలలో నటించి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు.

60 ఏళ్లు దాటిన అర్జున్ కు ఈ మధ్య కాలంలో హీరోగా నటించే అవకాశాలు లేకపోయినా తన వయసుకు తగ్గట్టుగా బలమైన పాత్రలు, విలన్ పాత్రలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అలానే అర్జున్ మూడేళ్ల క్రితం సర్వైవర్ అనే షోని హోస్ట్ చేసి స్మాల్ స్క్రీన్‌పై ఫేమస్ అయ్యాడు.
అర్జున్ నివేదితను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, అంజన ఉన్నారు. ఐశ్వర్య తన తండ్రి హోస్ట్ చేసిన సర్వైవర్ ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అలాగే నటుడు రామయ్య కొడుకు ఉమాపతితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది.

తల్లిదండ్రులు ఐశ్వర్య, ఉమాపతిల ప్రేమకు పచ్చజెండా ఊపారు. వీరి నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరగ్గా, కుటుంబ బంధువులు, స్నేహితులు మాత్రమే ఆ వేడుకకు హాజరయ్యారు. అర్జున్ నిర్మించిన ఆంజనేయ ఆలయంలో ఉమాపతి, ఐశ్వర్య అర్జున్ వివాహం నిన్న ఘనంగా జరిగింది.
వీరి వివాహానికి కొంత మంది స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లిని ప్రైవేట్‌గా నిర్వహించాలని కుటుంబసభ్యులు కోరుకోవడం వల్లే ఇలా చేశారని చెబుతున్నారు. అయితే ఈరోజు సాయంత్రం ఉమాపతి-ఐశ్వర్య వెడ్డింగ్ రిసెప్షన్ చాలా గ్రాండ్ గా జరగబోతోంది.
గత వారం రోజులుగా హల్దీ, మెహందీ వేడుకలతో సహా ఈ అడోరబుల్ జంట వివాహానికి ముందు వేడుకల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజా ఫొటోల్లో ఈ జంట చెన్నైలో సాంప్రదాయ హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నట్టు కన్పిస్తోంది. ఉమాపతి సాంప్రదాయ తెల్లని ధోతీ, చొక్కాలో కనిపించగా, ఐశ్వర్య అందమైన ఎరుపు చీరలో కనిపించింది. అలాగే భారీ నగలు కూడా అలంకరించుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతుండగా, ఈ నేపథ్యంలోనే కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఐశ్వర్య అర్జున్ 2013లో బూపతి పాండియన్ తెరకెక్కించిన తమిళ చిత్రం పట్టతు యానైతో సినీ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రంలో విశాల్ ప్రధాన పాత్రలో కనిపించాడు. ఇంకా ఆమె తన తండ్రి నిర్మించిన హిందీ-తమిళ ద్విభాషా చిత్రం ప్రేమ బరహ/సొల్లిదవలో కూడా కనిపించింది. ఇందులో చందన్ కుమార్ ప్రధాన పాత్రలో నటించింది.
ఉమాపతి రామయ్య విషయానికొస్తే, అతను 2017లో ఇన్‌బాశేఖర్ రూపొందించిన అడగపట్టత్తు మగజనంగాలే చిత్రంతో తన అరంగేట్రం చేసాడు. అతను చివరిగా 2021 చిత్రం తన్నే వండిలో కనిపించాడు. కాగా ఐశ్వర్య ఉమాపతి కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కొత్త జంటకు ఫిల్మిబీట్ తరపున శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











