Friendship Day పవన్‌ కల్యాణ్‌తో నాది విడదీయలేని బంధం.. గొడవలపై క్లారిటీ ఇచ్చిన ఆనంద్ సాయి

స్నేహం నిత్యనూతనం, నిత్య పరిమళం.. ఎలాంటి అరమరికలు లేకుండా సాగిపోయేది స్నేహం ఒక్కటే. మన జీవితంలో ఎన్ని బంధాలున్నా సరే మన ఇష్టాలని, కష్టాల్ని పంచుకోవడానికి దేవుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం అంటారు కానీ.. ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. చరిత్రలో ఎన్నో గొప్ప స్నేహితుల కథలను మనం చదువుకున్నాం. రామాయణ, మహాభారతంలో ప్రాణ త్యాగాలను చేసిన మిత్రులు గురించి విన్నాం. స్నేహం ఇంత గొప్పది కాబట్టే ప్రతి ఏడాది ఆగస్ట్ మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం.

అన్ని రంగాల్లో ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ ఎందరో గొప్ప స్నేహితులు ఉన్నారు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి ఆదర్శంగా నిలిచినవారెందరో. బాపు - రమణ, ఎన్టీఆర్ - ఏఎన్నార్, త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ - రాజీవ్ కనకాల, ప్రభాస్ - గోపీచంద్, శ్రీకాంత్ - శివాజీ రాజా, సమంత - నీరజ, మంచు లక్ష్మీ - తాప్సీ వంటి తారలు తెరపైనా.. నిజ జీవితంలోనూ మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. ఏళ్లుగా వీరిబంధం చెక్కు చెదరకుండా ఉందంటే స్నేహానికి వీరిచ్చే విలువ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Art Director Anand Sai about bonding with pawan kalyan on Friendship Day

ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది మిత్రుల్లో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒకరు. ఎన్నోసార్లు పవన్ మంచితనం , కష్టపడే తత్వం గురించి చెప్పుకొచ్చారు ఆనంద్. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణే తనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడని, ఏదైనా అనుకుంటే ఆయన సాధించే వరకు వదిలిపెట్టడని చెప్పారు. ఆధ్యాత్మికత ఆయనలో ఎక్కువని, ఎప్పుడూ పుస్తకాలు చదువుతారని .. పవన్ బెడ్‌పై తాను పడుకుంటే, ఆయన నేల మీద పడుకునేవారని గుర్తుచేసుకున్నారు.

తనది, కళ్యాణ్‌ది చాలా అందమైన జర్నీ అని.. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని, ఏదైనా బలంగా అనుకుంటే దాని మీద వర్క్ చేస్తాడని ఆనంద్ సాయి చెప్పారు. అన్నయ్య పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా.. తాను కష్టపడి పైకి రావాలి , తనకంటూ స్టైల్ ఉండాలని పవన్ భావించారని తెలిపారు.

Art Director Anand Sai about bonding with pawan kalyan on Friendship Day

సినిమాల్లోకి రావాలంటే ఎవరైనా డ్యాన్స్‌లు నేర్చుకుంటారని, కానీ కళ్యాణ్ కరాటేలో జాయిన్ అయ్యి దెబ్బలు తిన్నాడని.. అప్పుడు తిన్న దెబ్బలు బెస్ట్ రిజల్ట్ ఇచ్చాయని ఆనంద్ సాయి వెల్లడించారు. సక్సెస్ , ఫ్లాప్స్ గురించి తామిద్దరం ఎప్పుడూ మాట్లాడుకోమని.. 100 శాతం హార్డ్ వర్క్ చేస్తామని, రిజల్ట్ మనచేతిలో ఉండదన్నారు.

ఇన్నేళ్ల జర్నీలో మా ఇద్దరి మధ్యా గొడవలు, మనస్పర్ధలు రాలేదని.. గబ్బర్ సింగ్ టైంలో నాకు చినజీయర్ స్వామి ప్రాజెక్ట్ వచ్చిందని, తర్వాత యాదాద్రి వైపు వెళ్లిపోయానని ఆనంద్ సాయి తెలిపారు. పవన్ సినిమాల్లో, తాను ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉండేవాళ్లమని ..నేను షూటింగ్ స్పాట్‌కెళ్లి డిస్ట్రబ్ చేయలేదని.. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తే కలుస్తామని ఆయన పేర్కొన్నారు. ఒకరికొకరం ఏమీ ఆశించమని.. ఫ్రెండ్‌షిప్‌కు వాల్యూ ఇస్తామని ఆనంద్ సాయి వారి స్నేహం గురించి గొప్పగా చెప్పారు. వీరిద్దరి స్నేహం ఇంత గొప్పది కాబట్టే .. ఈ ఫ్రెండ్‌షిప్ డే నాడు ఆనంద్ సాయితో పవన్ ఉన్న ఫోటోలను జనసేనాని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X