twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రిపూట వీడియో కాల్స్.. సురేఖ వాణితో కలిసి రచ్చ చేసిన నటి

    |

    ప్రస్తుతం షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చినా సరే అందరూ ధైర్యంగా అడుగు ముందుకు వేయలేకపోతోన్నారు. ఈ క్రమంలోనే పెద్ద హీరోలు, పెద్ద సినిమాలేవీ సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఏది ఉన్నా సరే ఇంట్లో నుంచి పని చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ సైతం జూమ్ వీడియో కాల్‌ నంచి ఒడ్డెక్కిస్తున్నారు. ఇక ఈ వీడియో కాల్స్‌లో తారలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

    Recommended Video

    Actress Surekha Vani Panchekattu Video Goes Viral
    ఎవరి ఇంట్లో వారే..

    ఎవరి ఇంట్లో వారే..

    కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా గత ఐదారు నెలల నుంచి అందరూ ఇంటి పట్టునే ఉంటారు. బయటకు వెళ్లేందుకు ఎవ్వరూ సాహసం చేయడం లేదు. పైగా సినిమా ఇండస్ట్రీలో కరోనా తాండవం చేస్తోంది. ఇండియన్ బిగ్ స్టార్స్‌ ఇంట్లోనే కరోనా విజృంభించింది. అందుకే వీలైనంతగా అందరూ ఇంటి నుంచే సాధ్యమైన కార్యకలాపాలు చేసేస్తున్నారు.

    సురేఖా వాణి రచ్చ..

    సురేఖా వాణి రచ్చ..

    ఈ లాక్ డౌన్ సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఎంతగా రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. మామూలుగానే సోషల్ మీడియాలో కూతురు సుప్రితతో కలిసి హల్చల్ చేస్తూ ఉంటుంది. కూతురు బర్త్ డేకు సురేఖా వాణి చేసిన ఏర్పాట్లు, చేసిన పోస్ట్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

    టాలీవుడ్ మిత్రులు..

    టాలీవుడ్ మిత్రులు..

    క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో సురేఖా వాణి, హేమ, ప్రగతి, సుధ, ప్రియ ఎలా ఎంతో మంది బాగా పేరు సంపాదించుకున్న వారున్నారు. ప్రస్తుత తరంలో హీరో, హీరోయిన్లుకు అమ్మగానో, అత్తగానో నటించాలంటే పైన పేర్కొన్నవారే బెస్ట్ ఛాయిస్ అని నిరూపించుకున్నారు. ఇక వీరిలో సురేఖా వాణి, హేమ అత్యంత క్లోజ్‌గా ఉంటారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు వచ్చాయని, కొంత దూరంగా ఉంటున్నారని టాక్ వినిపించింది.

    వీడియో కాల్‌లో రచ్చ..

    వీడియో కాల్‌లో రచ్చ..

    సురేఖా వాణి తాజాగా నిన్న రాత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియతో వీడియో కాల్‌లో సంభాషించినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఇద్దరి మొహాలు బాగానే వెలిగిపోతున్నాయి. ఇద్దరి మొహాలు ఎంతో సంతోషంగా ఉన్నాయంటూ సురేఖా వాణి కామెంట్ చేయగా.. అవును దానికి మనం అర్హులే అని ప్రియ కామెంట్ చేసింది. ఇక వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    English summary
    Artist Surekha Vani And Priya Talks In Video Call. Surekha Vani And Priya Talks In Video Call, Their Faces Become Happy. They Shared Through Social Media About Happy Moment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X