బాత్రూంలో సుప్రిత అలా దొరికిపోయింది.. కూతురిపై నిఘా పెట్టిన సురేఖా వాణి
టాలీవుడ్ నటి సురేఖా వాణి, తన కూతురు సుప్రిత కలిసి చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిశారంటే అక్కడంతా సందడి సందడే. ఈ లాక్‌డౌన్‌లో వీరిద్దరు బాగానే రచ్చ చేశారు. అంతకు ముందు టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాను ఊపేశారు. ఇప్పుడు తల్లీకూతుళ్లిద్దరూ కలిసి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను దుమ్ములేపుతున్నారు. తాజాగా తన కూతురు బాత్రూంలో ఉందని చెబుతూ ఓ వీడియోను పెట్టింది. అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

బర్త్ డే రచ్చ..
ఆ మధ్య సుప్రిత బర్త్ డే వేడుకలు, వాటికి సంబంధించిన ఫోటోలు, ఆ సెలెబ్రేషన్స్‌లో సురేఖా వాణి వేసుకున్న డ్రెస్సు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇళ్లంతా డెకరేట్ చేసి కూతుర్ని సర్‌ప్రైజ్ చేసింది. ఇక బర్త్ డే సందర్బంగా ఓ పెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది సురేఖా వాణి.

ఆ పెట్ తన బిడ్డలా..
మనుషులకు సోషల్ మీడియా ఖాతాలుండటం పెద్ద ఆశ్చర్యం, విశేషం కాకపోవచ్చు. కానీ ఓ పెట్‌కు ఇన్ స్టాగ్రాం ఖాతా ఉండటం, దాన్ని కూడా కొన్ని వేల మంది ఫాలో అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక అందులో అందులో ఆ పెట్ బయోడేటాలో సన్ ఆఫ్ సుప్రిత అని కూడా యాడ్ చేసింది. మొత్తానికి సుప్రిత ఆ కుక్కను తన కొడుకుగా భావిస్తోందన్న మాట.

తాజాగా జైపూర్..
సురేఖ వాణి ఆ మధ్య జైపూర్‌కు వెళ్లింది. ఓ సినిమా షూటింగ్ కోసమని, పదిహేను రోజుల షెడ్యూల్ అని చెప్పింది. అయితే అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని మళ్లీ హైద్రాబాద్‌కు వచ్చింది. ఇక్కడే ఐదారు రోజులుంది. అయితే ఇప్పుడు మళ్లీ రాజస్థాన్‌కు వెళ్లిపోయింది.

అక్కడి హోటల్ బాత్రూంలో..
తాజాగా సురేఖ వాణి ఓ పోస్ట్ చేసింది. అందులో తన కూతురు బాత్రూంలో ఉందని పేర్కొంది. హోటల్ రూంలో ఇంకెక్కడా ప్లేస్ లేనట్టు పాప బాత్రూంలో ఉంది చూడండి అంటూ వీడియోను షేర్ చేసింది. ఇక అలా వీడియోను తీస్తుండటంతో.. సుప్రిత అసలు విషయాన్ని చెప్పింది. ఇక్కడ లైటింగ్ ఉందని వీడియో కోసం వచ్చానని చెప్పింది.
Recommended Video

అజ్మీర్ దర్గాలో..
అయితే కూతురితో సహా సురేఖా వాణి రాజస్థాన్‌లో అజ్మీర్ దర్గాకు వెళ్లింది. షూటింగ్ గ్యాప్‌లో అలా వెళ్లిందా? లేక దర్గాను దర్శించుకోవడానికే అలా వెళ్లిందో తెలియడం లేదు. మొత్తానికి ఏది ఏమైనా ఈ పోస్ట్‌లు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











