twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏదో ఒకటి చేయండిరా బాబు.. మారండిరా కొంచెం.. ట్రోలింగ్‌పై సురేఖా వాణి కూతురు ఫైర్

    |

    టాలీవుడ్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఎంత మందికి తెలుసో.. ఆమె కూతురు సుప్రిత కూడా అంత మందికి తెలుసు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తల్లీ కూతుళ్లే అయినా కూడా ఇద్దరూ స్నేహితుల్లానే ఉంటారు. మోడ్రన్ మదర్‌కు సురేఖా వాణి చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. అయితే తాజాగా సురేఖా వాణి తన కూతురుతో జాలీగా గడిపినట్టు కనిపిస్తోంది. వీరు తమ స్నేహితుల గ్యాంగ్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్టు కనిపిస్తోంది.

    షూటింగ్ నుంచి..

    షూటింగ్ నుంచి..

    సురేఖా వాణి, సుప్రిత ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకుని రాజస్థాన్ నుంచి తిరిగివచ్చారు. విజయ్ సేతుపతి, రాధిక, రాజేంద్ర ప్రసాద్ వంటి భారీ తారాగణంతో నటిస్తోన్న చిత్రంలో సురేఖా వాణి కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యే అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని హైద్రాబాద్‌కు తిరిగి వచ్చారు.

    అలా తప్పు

    అలా తప్పు

    సురేఖా వాణితో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది సుప్రిత. ఆ ఫోటోలో అమ్మపై ఉన్న ప్రేమ కనిపిస్తోంది. అయితే కామెంట్ రూపంలోనూ అమ్మ ప్రేమను చాటాలనుకుంది. ఈ క్రమంలోనే మై హ్యాపీ ప్లేస్ టిల్ మై లాస్ట్ బ్రీత్ (నా చివరి శ్వాస వరకు నాకు సంతోషం దొరికేది నీవద్దే) అని చెప్పుకొచ్చింది. అందులో బ్రీత్ స్పెల్లింగ్ తప్పుగా రాసింది.

    Recommended Video

    Actress Surekha Vani Panchekattu Video Goes Viral
     మారండిరా బాబు...

    మారండిరా బాబు...

    రెడీగా ఉంటారు కదా ఎవరు ఏం తప్పు చేస్తారో కామెంట్లలో వేసుకుందామ అని.. మీరు ఏంటి ఇంగ్లీష్‌లో పీహెచ్‌డీ చేశారా? లేకపోతే ఆక్స్ ఫర్డ్ నుంచి గ్రాడ్యూయేట్ అయ్యారా? పెద్ద దండం రా బాబు మీకు.. కొంచెం లైఫ్‌లో ఏదో ఒకటి చేయండిరా బాబు.. మా మీద పడిపోవడం కాకుండా. అసలు నేను నచ్చ లేదు అంటే ఇంకా ఫాలో అవ్వడం ఎందుకు నన్ను. ఏం తప్పు చేస్తుందో చూసి వేసుకోవడానికే కదా? చేంజ్ అవ్వండిరా కొంచెం అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది.

    English summary
    Artist Surekha Vani Daughter Supritha Counters To Trollers, Artist Surekha Vani and Supritha In Samode Jaipur, Surekha Vani Went To Shoot For ovie. Supritha Also Went With Her Mother.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X