అలా ఎంజాయ్ చేసేస్తున్నారు.. బీచ్‌లో మందుతో రచ్చ.. కూతురితో సురేఖా వాణి హల్చల్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాను ఎలా ఊపేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేఖా వాణి తన కూతురిని ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్తుంటారు. టిక్ టాక్ కాలం నడిచినప్పుడు ఈ తల్లీకూతుళ్లు చేసిన రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరూ కలిసి టిక్ టాక్‌ను బాగానే వాడేశారు.

సోషల్ మీడియాలో ఫేమస్..
సురేఖా వాణి తన కూతురితో కలిసి దిగిన ఫోటోలు, చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎలా మంట పెట్టాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కాలా చష్మా అంటూ బెడ్రూంలో చేసిన డ్యాన్స్ , లీకైన వీడియో ఓ ఊపు ఊపేసింది. ఆ తరువాత ఈ ఇద్దరూ టిక్ టాక్‌లో మోడ్రన్ డ్రెస్సులు, పంచెకట్టుతో కనిపించి దుమ్ములేపేవారు.

లాక్ డౌన్ తరువాత అలా..
లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. దాదాపు ఐదారు నెలలు ఎవ్వరూ కూడా గడపదాట లేదు. అలా అన్ లాక్ ప్రక్రియ మొదలవ్వడంతోనే సురేఖా వాణి షూటింగ్ నిమిత్తం రాజస్థాన్‌కు వెళ్లింది. తనతో పాటు జైపూర్‌లో జరిగిన షూటింగ్‌కు కూతుర్ని కూడా తీసుకెళ్లింది.

వచ్చాక ఇక్కడ కూడా..
అలా రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చాక హైద్రాబాద్‌లో మళ్లీ పార్టీలంటూ రచ్చ చేశారు. సుప్రిత, సురేఖా వాణి తమ గ్యాంగ్‌తో కలిసి హైద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్‌ను చూసేందుకు కారులో ట్రిప్ వేశారు. ఇలా మొత్తం లాక్ డౌన్ ఫ్రస్ట్రేషన్‌ను అలా తీర్చుకున్నారు. వీటి తరువాత దసరా పండుగ నాడు గోవాకు చెక్కేశారు.

దసరా స్పెషల్..
దసరా పండుగ రోజునే సురేఖా వాణి, సుప్రిత గోవాలో దర్శనమిచ్చారు. అక్కడ పబ్, క్లబ్, బీచ్‌లంటూ తిరుగుతూ సందడి చేశారు. ఇక ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఆటలు ఆడారు. సురేఖా వాణి, సుప్రిత షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా సురేఖా మరో ఫోటోను షేర్ చేసింది.

చేతిలో డ్రింక్ చుట్టు సముద్రం..
తాజాగా సురేఖా వాణి ఓ కూల్ అండ్ హాట్ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో వెదర్ కూల్‌గా ఉండగా.. సురేఖా వాణి మాత్రం హాట్‌గా ఉంది. పొట్టి డ్రెస్ వేసుకుని, చేతిలో మందు గ్లాసు పట్టుకుని సముద్రాన్ని చూస్తూ కూతురుని పట్టుకుని అలా లైఫ్‌ను ఎంజాయ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











