ఓవైపు బాలయ్య డైలాగ్.. మరోవైపు ధూమపానం.. ఇంకోవైపు నీతులు.. వారెవ్వా హీరోయిన్ రచ్చ!!

సోషల్ మీడియాలో కొటేషన్స్, నీతులు, ప్రవచనాలు వంటివి చెప్పేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఎవరు ఎలాంటివి చెప్పినా సరే తీసుకోవాలా? వద్దా? అనేవి వ్యక్తిగతం. అయితే చెప్పే మంచి మాటలకు ఓ పద్దతి ఉంటుంది. మంచి మాటలను మంచి పద్దతిలో చెబితే కొంతమంది వింటారేమో. కానీ మంచి మాటలను చెడు పద్దతిలో చెబితే ఎవ్వరూ ఫాలో అవ్వరు. పైగా చూపించిన చెడ్డ పద్దతినే ఫాలో అవుతుంటారు.

నాటకం హీరోయిన్ రచ్చ..

నాటకం హీరోయిన్ రచ్చ..

కళ్యాణ్ గోగన దర్శకత్వంలో వచ్చిన నాటకం చిత్రంతో అషీమా నర్వాల్ తెలుగు తెరకు పరిచయమైంది. అశీష్ గంధి పక్కన హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత జెస్సీ అనే మరో చిత్రంలో నటించింది. అయితే అషీమాకు వెండితెరపై అంతగా గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడికి భారీ ఫాలోయింగ్ ఉంది.

హైద్రాబాద్ పరిస్థితిపై కౌంటర్..

హైద్రాబాద్ పరిస్థితిపై కౌంటర్..

ప్రస్తుతం హైద్రాబాద్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీధులన్నీ మునిగపోయాయి. నగరం మొత్తం సంద్రంలా మారింది. ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చేశాయి. ఇలాంటి విపత్కర పరిస్థితి రావడానికి మనమే కారణం అంటూ పరోక్షంగా చెబుతూ అషీమా సిగరెట్ తాగుతున్న వీడియోను షేర్ చేసింది.

మనం చేసిందే తిరిగి వస్తుంది..

మనం చేసిందే తిరిగి వస్తుంది..

డోంట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్ .. ఇఫ్ యూ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యూ.. ఐయామ్ నాట్ ద ట్ర‌బుల్ అంటూ బాలయ్య డైలాగ్ చెప్పిన అషీమా ఓ సందేశాన్ని ఇచ్చింది. ప్రకృతికి మనం ట్రబుల్స్ ఇచ్చాం.. అందుకే రివర్స్‌లో మనకు ట్రబుల్స్ ఇస్తోంది. అయితే ప్రకృతి ఎప్పటికీ కూడా సమస్యలను ఇవ్వదు.. మనం సృష్టిస్తాం.. ఇదే అంతిమ సత్యమని చెప్పుకొచ్చింది.

షాక్ అవుతారు..

షాక్ అవుతారు..

నేను సిగరెట్ తాగుతున్న వీడియోను చూసి మీరు షాక్ అవుతారు.. కానీ మీరు మీ కార్లు, బైకులు, ఫ్యాక్టరీలతో ప్రకృతిని కాల్చేసేటప్పుడు ఎందుకు షాక్ అవ్వరు. మామూలుగా అది మిమ్మల్ని ఎక్కువ షాక్‌కు గురి చేయాలి అంటూ నీతులు చెప్పింది.

Recommended Video

Killer Movie Team Interview || Vijay Antony || Arjun Sarja || Andrew Louis || Filmibeat Telugu
నెటిజన్లు ఫైర్...

నెటిజన్లు ఫైర్...

అషీమా చెప్పిందాంట్లో నిజమే ఉన్నా మరీ అంత బోల్డ్‌గా చెప్పాల్సిన పని లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమాలోని పాత్ర కోసం సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పడంపైనా రియాక్ట్ అవుతున్నారు. ప్రాక్టీస్ చేస్తే చేసుకున్నావ్ ఇలా పబ్లిక్‌గా వీడియో పెట్టాల్సిన పనేముందని కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X