నా బెడ్‌రూంలో పవన్ కల్యాణ్.. మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది: బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్

సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ అనే అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తద్వారా సినిమా ఆఫర్లను కూడా పట్టేశారు. మరికొందరైతే బడా బడా స్టార్లకు డూపులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో తెలుగందం అషు రెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ యాప్‌లో చేసిన వీడియోలతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆ సుందరాంగి ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఎన్నో ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్‌పై బోల్డ్ కామెంట్స్ చేసి షాకిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

జూనియర్ సమంతకు సినిమా అవకాశం

జూనియర్ సమంతకు సినిమా అవకాశం

డబ్‌స్మాష్ వీడియోల పుణ్యమా అని అషు రెడ్డికి జూనియర్ సమంత అనే పేరు వచ్చింది. దీని వల్ల సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కూడా కలిగింది. దీంతో ఛాన్సుల కోసం వేచి చూసింది. ఇలాంటి సమయంలో నితిన్ హీరోగా చేసిన 'ఛల్ మోహనరంగ'లో ఆమెను తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ప్రేమ విఫలం.. డిప్రెషన్‌లోకి వెళ్లిన భామ

ప్రేమ విఫలం.. డిప్రెషన్‌లోకి వెళ్లిన భామ

నితిన్ సినిమాలో నటించిన తర్వాత గ్యాప్ తీసుకుంది అషు రెడ్డి. దీనికి కారణం ఆమె ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లడమే. ఇక, అక్కడ ఓ అబ్బాయితో ప్రేమలో కూడా పడిందీ బ్యూటీ. కొద్ది రోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత అతడితో బ్రేకప్ అయింది. అప్పుడే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి.. బాగా లావైపోయింది. ఈ విషయాలను అషునే స్వయంగా చెప్పింది.

బిగ్ బాస్ షోలో ఛాన్స్.. మళ్లీ పాపులర్

బిగ్ బాస్ షోలో ఛాన్స్.. మళ్లీ పాపులర్

రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది అషు రెడ్డి. బొద్దు లుక్‌తో ఆమెను చూసిన వారంతా షాకైపోయారు. కానీ, అందానికి మాత్రం చాలా మంది ఫిదా అయ్యారు. అదే సమయంలో చక్కని ఆటతీరుతో పాటు డ్యాన్సులు చేయడం.. పాటలు పాడడం వంటి వాటితో ఈ అమ్మడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిపోయింది.

బయటికొచ్చాక రచ్చ.. అక్కడ సెన్సేషన్

బయటికొచ్చాక రచ్చ.. అక్కడ సెన్సేషన్

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అషు రెడ్డి రచ్చ రచ్చ చేస్తోంది. మొదటి నుంచీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. ఇప్పుడు మరింతగా రెచ్చిపోతోంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

అది చూపించి.. అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్

అది చూపించి.. అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని చెప్పుకొచ్చింది అషు రెడ్డి. అంతేకాదు, ఆయన పేరును ప్రైవేటు ప్లేస్‌లో టాటూగా వేయించుకున్నట్లు ఓ ఫొటోను కూడా షేర్ చేశారు ఆమె స్నేహితులు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అషు రెడ్డికి మద్దతు తెలిపారు. ఇక, ఈ మధ్య మరోసారి తన టాటూను చూపిస్తూ దిగిన ఫొటోను షేర్ చేసిందామె.

Recommended Video

Nithiin's Check Movie Release Date Revealed | Filmibeat Telugu
నా బెడ్‌రూంలో పవన్ కల్యాణ్.. మళ్లీ మళ్లీ

నా బెడ్‌రూంలో పవన్ కల్యాణ్.. మళ్లీ మళ్లీ

తాజాగా రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది అషు రెడ్డి. ఈ సందర్భంగా యాంకర్.. 'ఉదయం లేచే సరికి నీ బెడ్‌రూంలో పవన్ కల్యాణ్ ఉంటే ఏం చేస్తావ్' అని ఆమెను ప్రశ్నించింది. దీనికి 'అదే జరిగితే.. ఆరోజు అస్సలు ఫినీష్ అవకూడదని అనుకుంటా. మళ్లీ మళ్లీ అలాంటి రోజే రావాలని కోరుకుంటా' అంటూ బోల్డుగా సమాధానం ఇచ్చిందీ బ్యూటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X