పవన్ గారిలో డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు.. అమ్మాయిలకు అవకాశం ఇస్తారా: వాళ్లకు అషు రెడ్డి వార్నింగ్
అషు రెడ్డి.. కొంత కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అమ్మాయి. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈమె.. తన వ్యక్తిగత తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియా వల్ల పాపులర్ అయిన ఈమెకు పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. ఇటీవల ఆయనను కలిసి దానికి సంబంధించిన ఫొటోలను కూడా వదిలింది. అదే సమయంలో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇస్తూ ఓ వీడియోను వదిలింది అషు. ఆ వివరాలు మీకోసం!
భర్తతో శృంగార భంగిమల్లో బీచిలో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

అచ్చం సమంత లాగే.. ఎనలేని ఫాలోయింగ్
అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోలు సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేశాయి. దాని ద్వారానే తెలుగు వాళ్లకు పరిచయం అయింది అషు రెడ్డి. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండే ఈ అమ్మడు.. ఆమెకు సంబంధించిన వీడియోలు చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా గుర్తింపును పొందింది. అంతేకాదు, జూనియర్ సమంత అనే పేరు తెచ్చుకుంది.

ఒకే ఒక్క సినిమాలో.. ఆ తర్వాత కనిపడలే
సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన అషు రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే యంగ్ హీరో నితిన్‌తో పవన్ కల్యాణ్ నిర్మించిన చిత్రం 'ఛల్ మోహనరంగ'లో ఆమె హీరోయిన్ స్నేహితురాలి పాత్రను పోషించింది. అందులో మెప్పించినప్పటికీ ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదామె. అంతేకాదు, దాదాపు రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయి అందరికీ షాకిచ్చేసింది.

బాస్ కోసం రీఎంట్రీ ఇచ్చింది... లుక్ మాత్రం
చాలా గ్యాప్ తర్వాత అషు రెడ్డి బిగ్ బాస్ షో కోసం రీఎంట్రీ ఇచ్చింది. రెండేళ్ల క్రితం ప్రసారం అయిన మూడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది. అదే సమయంలో బొద్దు లుక్‌తో మాత్రం అందరికీ షాకిచ్చింది. అమెరికాలో ఉన్న సమయంలో ఓ అబ్బాయితో ప్రేమలో పడి.. బ్రేకప్ అవడం వల్ల డిప్రెషన్‌కు వెళ్లింది. ఈ కారణంగానే లావైపోయింది.

పవన్ కల్యాణ్‌పై అభిమానం.. అక్కడ టాటూ
అషు రెడ్డికి టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానం. అప్పుడెప్పుడో అతడి పేరును తన ఎద భాగంలో వేయించుకుంది కూడా. అంతేకాదు, ఆ ఫొటోను కూడా సోషల్ మీడియాలో వదిలింది. దీంతో ఆమెకు పవర్ స్టార్ అభిమానుల మద్దతు కూడా లభించింది. దీని తర్వాతనే ఆయనను కలిసింది. ఈ ఫోటోలు అప్పట్లో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టాయి.

మళ్లీ కలిసిన అషు రెడ్డి.. పవన్ లెటర్ కూడా
ఇటీవల పవన్ కల్యాణ్‌ను అషు రెడ్డి మరోసారి కలిసింది. ఆ ఫొటోను షేర్ చేస్తూ.. 'నా దేవుడిని మరోసారి కలిశాను. నన్ను, నా టాటూను గుర్తుంచుకున్నానని ఆయన నాతో చెప్పారు. అంతేకాదు, నాకు టీ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆయన నాకు లెటర్ కూడా ఇచ్చారు. నాకు చాలా గర్వంగా ఉంది. మీరే ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ పవన్ గారు' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చిందామె.

రాంగ్ స్టేట్‌మెంట్.. వాళ్లకు అషు రెడ్డి వార్నింగ్
పవన్‌ను కలిసిన సందర్భంలో అషు రెడ్డి చేసిన పోస్టుకు ఓ నెటిజన్ 'మీకు అవకాశం వస్తే పవన్ నాలుగో భార్యగా ఉంటారా' అని ప్రశ్నించగా.. వెంటనే ఆమె 'యస్' అంటూ బదులిచ్చింది. దీంతో మీడియాలో దీన్ని బాగా హైలైట్ చేసి రాశారు. అషును పవన్ నాలుగో భార్యతో పోల్చారు. దీంతో తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసి మరీ ఆ వార్తలు రాసిన వాళ్లపై ఫైర్ అయిందీ తెలుగమ్మాయి.

పవన్ గారిలో డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు
ఆ వీడియోలో 'నాపై పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. అది మంచి పద్దతి కాదు. పవన్ నాకు దేవుడితో సమానమని ముందే చెప్పాను. ఫ్యాన్ అంటే ఫ్యాన్ మాత్రమే. మీ రాతల వల్ల పవన్ గారు అమ్మాయిలను కలవాలా వద్దా అనుకుంటారు. మీరే ఆయనలో డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. మీ వల్ల నా పేరును నాశనం చెయకండి. ఎవరినీ బద్నాం చేయకండి' అంటూ వార్నింగ్ ఇచ్చింది అషు.


Click it and Unblock the Notifications











