అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి

సోషల్ మీడియా వల్ల ఎంతో మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగులోనూ లెక్కలేనంతగా సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. అప్పుడెప్పుడో వచ్చిన డబ్‌స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. రెండు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. తద్వారా కొన్ని లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ పేరుతోనే కొన్ని ఆఫర్లు కూడా దక్కించుకుంది. ఇక, పవన్ కల్యాణ్ టాటూతో ఆ మధ్య రచ్చ లేపిన ఈ బ్యూటీ.. తాజాగా ఆయనను కలిసింది. అంతేకాదు, ఓ ఫోటోతో మేటర్ రివీల్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

జూనియర్ సమంతగా పేరు.. హాట్ టాపిక్

జూనియర్ సమంతగా పేరు.. హాట్ టాపిక్


సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన పేరును సంపాదించుకుంది అషు రెడ్డి. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండే ఈ అమ్మడు.. ఎంతో మంది కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. అదే సమయంలో జూనియర్ సమంతగానూ గుర్తింపును తెచ్చుకుంది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తోంది.

పవన్ సినిమాలోనే అవకాశం.. మిస్సింగ్

పవన్ సినిమాలోనే అవకాశం.. మిస్సింగ్

యంగ్ హీరో నితిన్‌తో పవన్ కల్యాణ్ నిర్మించిన చిత్రం 'ఛల్ మోహనరంగ'. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రను అషు రెడ్డి పోషించింది. మొదటి సినిమానే అయినా చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా తర్వాత ఈ తెలుగు అమ్మాయి కనిపించకుండా వెళ్లిపోయింది.

బిగ్ బాస్ కోసం రాక.. లుక్ చూసి అవాక్

బిగ్ బాస్ కోసం రాక.. లుక్ చూసి అవాక్

సుదీర్ఘ విరామం తర్వాత అషు రెడ్డి బిగ్ బాస్ షో కోసం స్క్రీన్‌పై దర్శనమిచ్చింది. రెండేళ్ల క్రితం ప్రసారం అయిన మూడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆటతో ఆకట్టుకుంది. అదే సమయంలో బొద్దు లుక్‌తో మాత్రం అందరికీ షాకిచ్చింది. అమెరికాలో ఉన్న సమయంలో ఓ అబ్బాయితో ప్రేమలో పడి.. బ్రేకప్ అవడం వల్ల డిప్రెషన్‌కు వెళ్లింది. ఈ కారణంగానే లావైపోయింది.

ఆ షోలోకి ఎంట్రీ... అదరగొడుతోన్న అషు

ఆ షోలోకి ఎంట్రీ... అదరగొడుతోన్న అషు

స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ప్రతి వారం స్కిట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలను వదులుతోంది.

ఎద భాగంలో పవన్ టాటూ చూపించింది

ఎద భాగంలో పవన్ టాటూ చూపించింది


అషు రెడ్డి మొదటి నుంచీ పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని చెప్పుకొస్తోంది. అంతేకాదు, ఆయన పేరును ప్రైవేటు ప్లేస్‌లో టాటూగా వేయించుకున్నట్లు ఓ ఫొటోను గతంలోనే షేర్ చేసిందామె. దీంతో బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెకు మద్దతు తెలిపారు. ఇక, ఈ మధ్య మరోసారి తన టాటూను చూపిస్తూ దిగిన ఫొటోను షేర్ చేసి హైలైట్ అయింది.

పవన్‌ను కలిసిన అషు రెడ్డి.. లెటర్ కూడా

పవన్‌ను కలిసిన అషు రెడ్డి.. లెటర్ కూడా

తాజాగా అషు రెడ్డి.. తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిసింది. హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయనతో కాసేపు మంతనాలు కూడా జరిపింది. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు పవన్ ఓ లెటర్ ఇచ్చాడు. అందులో 'అశ్వినీ (అషు) మీరు కోరుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నా' అని రాశాడు.

టాటూను పవన్ చూశారు.. ఆఫర్ ఇచ్చారు

టాటూను పవన్ చూశారు.. ఆఫర్ ఇచ్చారు


ఇక, పవన్ కల్యాణ్‌తో కలిసిన విషయాన్ని వివరిస్తూ.. 'నా దేవుడిని మరోసారి కలిశాను. నన్ను, నా టాటూను గుర్తుంచుకున్నానని ఆయన నాతో చెప్పారు. అంతేకాదు, నాకు టీ ఆఫర్ కూడా ఇచ్చారు. అలా రెండు గంటలు ఆయనతో గడిపాను. ఆయన నాకు లెటర్ కూడా ఇచ్చారు. నాకు చాలా గర్వంగా ఉంది. మీరే ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ పవన్ గారు' అంటూ రాసుకొచ్చింది అషు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X