Don't Miss!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- News
ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అషు రెడ్డి: బయటికొచ్చిన స్క్రిన్ షాట్స్.. కొంప ముంచిన ఫొటో
అషు రెడ్డి.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేర్లలో ఇది ఒకటి. అంతలా ఈ బ్యూటీ తరచూ ఏదో ఒక పని చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. సినిమాల్లో నటించకున్నా.. హీరోయిన్లతో సమానమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తద్వారా టీవీ షోల ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలోనే తాజాగా అషు రెడ్డి ఓ పని చేస్తూ దొరికిపోయింది. దీనికి కారణం ఆమె చేసిన ఓ పొరపాటే అని తెలుస్తోంది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

అలా ఫేమస్ అయిపోయిన అషు రెడ్డి
సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు కొంత కాలంగా ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ వీడియాల ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. జూనియర్ సమంతగా పేరు సంపాదించుకుంది. అదే సమయంలో యూత్ స్టార్ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.

అప్పటి నుంచి మారిన అషు రెడ్డి కెరీర్
నితిన్ సినిమా తర్వాత ఒక్కసారిగా తెలుగు వాళ్లకు దూరంగా వెళ్లిపోయింది అషు రెడ్డి. ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగం చేసింది. అప్పుడక్కడ ఓ వ్యక్తితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత బ్రేకప్ అవడం.. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురవడం జరిగింది. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో గెలవకపోయినా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తోంది.

అలాంటి పనులతో.. సెన్సేషన్ అయింది
అషు రెడ్డి హైలైట్ అవడానికి సోషల్ మీడియానే కారణం. దాదాపు ఆరేడేళ్లుగా ఈ బ్యూటీ అందులో హల్‌చల్ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే, దూకుడైన వ్యవహార శైలితో సెన్సేషన్‌గా మారిపోయింది.

కమెడియన్లతో కలిసి రచ్చ... లవ్ ట్రాకు
స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్' ద్వారా బుల్లితెరపైనా అషు రెడ్డి బిజీ అయింది. ఇందులో హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్, చమ్మక్ చంద్ర పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ప్రెస్ హరికి హగ్గులు, ముద్దులు ఇచ్చి అనుమానాలు రేకెత్తించింది.

మరో అవతారంలో అషు.. అతడితో రచ్చ
ఇటీవలే అషు రెడ్డి యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం ఆమె యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. జబర్ధస్త్ అజయ్ కీలక పాత్రను చేస్తున్నాడు. దీంతో వీళ్లంతా ఇటీవల లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ప్రెస్ హరి తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది.

ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన అషు రెడ్డి
అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక ఫొటోను వదులుతుంటుందామె. ఇక, తాజాగా ఇంట్లో ఉన్నప్పటి ఓ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ ఎదురుగా బిగ్ స్క్రీన్ కనిపిస్తోంది. అందులో అషు రెడ్డి పబ్‌జీ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయింది.

బయటికొచ్చిన స్క్రిన్ షాట్స్.. ఫొటో వల్లే
అషు రెడ్డి.. పబ్‌జీ గేమ్ ఆడుతున్న విషయాన్ని ఆమె అభిమానులే కనిపెట్టారు. అలాగే, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. అలాగే, కొందరు ఆమె యూజర్ నేమ్ కూడా రివీల్ చేశారు. మరికొందరైతే ఈ బ్యూటీతో కలిసి గేమ్ ఆడిన విషయాన్ని కూడా వెల్లడించారు. వాటిని తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి గేమ్ ఆడే విషయాన్ని ఒప్పుకుంది.