రాహుల్‌తో డేటింగ్‌పై అషు రెడ్డి కీలక వ్యాఖ్యలు: ఎప్పటి వరకు ఆగాలి బేబీ అంటూ!

డబ్‌స్మాష్ అనే యాప్ ద్వారా వెలుగులోకి రావడంతో పాటు తక్కువ సమయంలోనే సెలెబ్రిటీగా మారిపోయింది అషు రెడ్డి. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఫాలోయింగ్‌ పెంచుకుని సినిమాల్లో నటించే అవకాశాన్ని సైతం అందుకుంది. ఇలా కెరీర్ పరంగా బిజీ అయిపోయిన ఈ అమ్మడు.. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అవడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్‌ను దక్కించుకుంది. ఇక, రెండు రోజుల క్రితం రాహుల్ సిప్లీగంజ్ చేసిన ప్రకటనతో మరింత హైలైట్ అయింది. అతడితో డేటింగ్‌పై తాజాగా స్పందించింది అషు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం.!

ఆ ఒక్క సినిమాలో మెరిసిన అషు రెడ్డి

ఆ ఒక్క సినిమాలో మెరిసిన అషు రెడ్డి

అచ్చం సమంతలానే ఉంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది అషు రెడ్డి. అప్పుడు వచ్చిన పాపులారిటీతో నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ' అనే సినిమాలో నటించింది. దీని తర్వాత కొన్ని ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చినప్పటికీ.. వాటిని రిజెక్ట్ చేసింది. హీరోయిన్‌గా చేయాలన్న ఉద్దేశంతో చాలా సినిమాలను వదులుకుంది. ఫలితంగా మరో సినిమాలో కనిపించలేదు.

 ప్రేమలో విఫలం.. మారిపోయిన రూపం

ప్రేమలో విఫలం.. మారిపోయిన రూపం

అషు రెడ్డిది విశాఖపట్నం. ఆమె విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేసింది. అయితే, గ్రాడ్యుయేషన్ కోసం యూఎస్ వెళ్లింది. అది పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా చేసింది. ఆ సమయంలోనే ఒకరితో ప్రేమలో పడింది. అయితే, కొద్ది రోజుల్లోనే అది బ్రేకప్ అయిపోవడంతో, ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో మందులు వాడడం వల్ల చాలా బొద్దుగా మారిపోయింది.

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీతో మారింది

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీతో మారింది

గత ఏడాది ప్రసారం అయిన మూడో సీజన్‌ ద్వారా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అషు రెడ్డి. ఈ షోలో మంచి ప్రదర్శన చేయడంతో గుర్తింపును అందుకుంది. పలుమార్లు నామినేషన్‌లో ఉన్నా.. ప్రేక్షకుల ఆదరణతో సేవ్ అయింది. అయితే, ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో చివరి వరకూ ఉండలేకపోయినప్పటికీ.. యూత్‌లో క్రేజ్‌ను మాత్రం విపరీతంగా పెంచుకోగలిగింది.

సోషల్ మీడియాలో అలాంటి ఫొటోలు

సోషల్ మీడియాలో అలాంటి ఫొటోలు

అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన గ్లామరస్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. గతంలో పవన్ పేరున్న టాటూను వదిలిన విషయం తెలిసిందే.

రాహుల్ సిప్లీగంజ్‌తో రియల్ రిలేషన్

బిగ్ బాస్ తర్వాత పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతోంది అషు రెడ్డి. ఈ క్రమంలోనే తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌కు సైతం వెళ్తోంది. ఇలానే రెండు రోజుల క్రితం బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వదిలిన అతడు.. తామిద్దరం రియల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ప్రకటించి బాంబ్ పేల్చాడు.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
డేటింగ్‌పై అషు రెడ్డి కీలక వ్యాఖ్యలు

డేటింగ్‌పై అషు రెడ్డి కీలక వ్యాఖ్యలు

బిగ్ బాస్ విన్నర్ రాహుల్ చేసిన పోస్టుపై తాజాగా అషు రెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడితో దిగిన ఫొటోను షేర్ చేసి.. ‘సమయం వస్తుంది. నిజాలన్నీ అప్పుడే తెలుస్తాయి' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో అసలేం జరిగిందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీనికి ‘సమయం ఎప్పుడు వస్తుంది బేబీ' అంటూ రిప్లై ఇచ్చాడు రాహుల్ సిప్లీగంజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X