Pawan Kalyanపై ఇష్టాన్ని అలా చూపించిన అషు రెడ్డి: ప్రైవేట్ పార్ట్‌లో టాటూ.. ఈ సారి ఏకంగా అక్కడలా!

అషు రెడ్డి.. అషు రెడ్డి.. అషు రెడ్డి.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా ఈ అమ్మడు తన వ్యవహార శైలితో తరచూ హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ.. నిత్యం ఏదో ఒక పోస్టుతో హల్‌చల్ చేస్తూనే ఉంటోంది. ఈ మధ్య బుల్లితెరపైనా పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆమెకు విపరీతమైన పిచ్చి. గతంలో అతడి టాటూను వేయించుకోవడంతో పాటు కొన్ని ఫొటోలు సైతం దిగింది. ఇప్పుడు అషు ఆయనపై ఇష్టాన్ని బయటపెట్టింది. వివరాల్లోకి వెళ్తే..

సాయంత్రం వేళలో శ్రీదేవి కూతురు షికారు.. అలా బయటకు ఖుషి కపూర్ షాక్

అషు రెడ్డి.. అలా ఫేమస్ అయిపోయింది

అషు రెడ్డి.. అలా ఫేమస్ అయిపోయింది

కొన్నేళ్ల క్రితం డబ్‌స్మాష్ వీడియోలు భారతదేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. వీటి ద్వారానే చాలా మంది అమ్మాయిలు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో అషు రెడ్డి కూడా ఒకరు. చూడ్డానికి అచ్చం సమంత లాగే ఉండే ఆమెకు జూనియర్ సామ్ అనే బిరుదు కూడా వచ్చింది. అలా ఫేమస్ అయిన ఆమె.. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది.

 సినిమా.. బిగ్ బాస్.. టీవీ షోలతో హవా

సినిమా.. బిగ్ బాస్.. టీవీ షోలతో హవా

సోషల్ మీడియా వల్ల వచ్చిన గుర్తింపుతోనే అషు రెడ్డి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ' అనే సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టైటిల్ గెలవకున్నా.. ప్రేక్షకులను గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని టీవీ షోలలో సైతం భాగం అయింది. తద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూనే

ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూనే

అషు రెడ్డికి టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ అంటే పిచ్చి. అప్పుడెప్పుడో అతడి పేరును తన ఎద భాగంలో వేయించుకుంది కూడా. అంతేకాదు, ఆ ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అప్పటి నుంచి ఆమెకు పవర్ స్టార్ అభిమానుల మద్దతు కూడా దక్కుతోంది. దీని తర్వాతనే ఆయనను కలిసింది. ఈ ఫోటోలు అప్పట్లో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టాయి.

మళ్లీ కలిసిన అషు... లెటర్ తీసుకుంది

మళ్లీ కలిసిన అషు... లెటర్ తీసుకుంది

పవన్ కల్యాణ్‌ను అషు రెడ్డి ఇటీవల మరోసారి కలిసింది. ఆ ఫొటోను షేర్ చేస్తూ.. 'నా దేవుడిని మరోసారి కలిశాను. నన్ను, నా టాటూను గుర్తుంచుకున్నానని ఆయన నాతో చెప్పారు. అంతేకాదు, నాకు టీ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆయన నాకు లెటర్ కూడా ఇచ్చారు. నాకు చాలా గర్వంగా ఉంది. మీరే ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ పవన్ గారు' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిందామె.

పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్య అంటూ

పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్య అంటూ

పవన్ కల్యాణ్‌తో సమావేశం అయిన సమయంలోనే అషు రెడ్డిని ఓ నెటిజన్ 'ఆయనకు నాలుగో భార్యగా ఉంటావా' అని అడిగాడు. దీనికి ఆమె వెంటనే అవునంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఇది పెద్ద రచ్చ అయిపోయింది. అప్పుడు స్పందించిన అషు రెడ్డి.. 'పవన్ గారి పేరును చెడగొడుతున్నారు. దయచేసి ఆ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టండి' అంటూ ఓ వీడియోను సైతం వదిలింది.

పవన్‌పై ఇష్టాన్ని అలా చూపించిన అషు

పవన్‌పై ఇష్టాన్ని అలా చూపించిన అషు

పవన్ కల్యాణ్ అంటే అషు రెడ్డికి పిచ్చ అభిమానం అన్న విషయం తెలిసిందే. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఆయన ఫొటోనో, వీడియోనో ఇలా ఏదో ఒక దానిని విడుదల చేస్తూ ఉంటుంది. తద్వారా అతడిపై ఉన్న అభిమానాన్ని బయట పెట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌పై తనకు ఉన్న ప్రేమను బయట పెడుతూ ఓ ఫొటోను వదిలింది హాట్ బ్యూటీ అషు రెడ్డి.

 ఈ సారి ఏకంగా అక్కడలా పెట్టుకుందిగా

ఈ సారి ఏకంగా అక్కడలా పెట్టుకుందిగా

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అషు రెడ్డి ఓ ఫొటోను స్టోరీగా పెట్టుకుంది. అందులో ఆమె పెట్ డాగ్‌ను పట్టుకున్నట్లు కనిపించింది. కానీ, అసలు హైలైట్ చేయాల్సింది ఏంటంటే.. ఆమె పెట్టుకున్న స్మార్ట్ వాచ్‌లో పవన్ కల్యాణ్‌తో దిగిన ఫొటోను వాల్‌పేపర్‌గా సెట్ చేసింది. చాలా మంది దీని పైనే ఫోకస్ చేయడంతో ఈ మేటర్ హాట్ టాపిక్ అయింది. మొత్తానికి ఇలా తన ఇష్టాన్ని బయట పట్టిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X