Don't Miss!
- News
దొంగ మోదీకి దారి క్లియర్ -నీరవ్ అప్పగింతకు యూకే హోం శాఖ ఆమోదం -నేడో రేపో భారత్‌కు
- Sports
విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. 1980కి కపిల్ దేవ్, 1990కి సచిన్ ఎంపిక!!
- Finance
Citibank Exit: సిటీ బ్యాంకు ఎందుకు మూతబడుతోంది! వీరు కొనుగోలు చేసే ఛాన్స్
- Automobiles
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోజాకు అషూ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి.. ఆ ఫోటోతో అంతా షాక్.. నెటిజన్ల ప్రశ్నల వర్షం
బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తన చిన్న నాటి ఫోటోలను షేర్ చేసి అందరిలోనూ అనుమానాలను పుట్టించింది. అందులో రోజాతో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్లు తలలు గోక్కుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా అషూ రెడ్డి రోజా మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు. అలా ఇప్పుడు సోషల్ మీడియాలో అషూ రెడ్డి పేరు మార్మోగిపోతోంది.

సోషల్ మీడియాలో అలా..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషూ రెడ్డి నెటిజన్లకు ఇచ్చే కామెంట్లతో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్, రాహుల్ సిప్లిగంజ్ విషయంలో అషూ ఎంతటి ట్రోలింగ్‌ను ఎదుర్కొందే అందరికీ తెలిసిందే.

రాహుల్‌తో రిలేషన్..
బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లైన రాహుల్ అషూ రెడ్డిలు ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు అందరూ భ్రమపడ్డారు. ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ తామిద్దరం జిగ్రీ దోస్తులమని అషూ, రాహుల్ చెబుతుంటారు.

పవన్ కళ్యాణ్‌తో అలా..
పవన్ కళ్యాణ్‌తో అషూ రెడ్డి దిగిన ఫోటోలు ఎంతలా సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నాల్గో భార్యగా ఉంటావా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఉంటాను అని సమాధానం చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది.

తాజాగా అలా..
అషూ రెడ్డి తాజాగా తన బాల్యాన్ని గుర్తుకు చేసుకుంది. ఇందులో భాగంగా తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. అషూ పాప ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీంతో చివరగా ఓ ట్విస్ట్ ఇచ్చింది అషూ రెడ్డి. చిన్నతనంలోనే రోజాతో దిగిన ఫోటోను అషూ రెడ్డి షేర్ చేయడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

సంబంధం ఏంటి?
అషూ రెడ్డి తన చిన్నతనంలోనే రోజాతో ఫోటో దిగింది. తాజాగా ఆ ఫోటోను బయట పెట్టేసింది. అయితే రోజాతో అషూకు సంబంధం ఏంటి? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కానీ అషూ మాత్రం నెటిజన్లు చేస్తోన్న ఆ కామెంట్లకు రిప్లైలు ఇవ్వడం లేదు.