సీక్రెట్ ప్లేస్‌లో పవన్ టాటూ: అలా లేపి చూపించిన బిగ్ బాస్ బ్యూటీ.. అమ్మడి తీరుకు వాళ్లంతా షాక్!
సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది తమలోని టాలెంట్‌ను నిరూపించుకుని వెలుగులోకి వస్తున్నారు. మరికొందరు తమ అందంతో నెటిజన్లను ఫిదా చేస్తూ ఎనలేని క్రేజ్‌ను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఆఫర్లను కూడా ఒడిసి పట్టుకుని బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో తెలుగు బ్యూటీ అషు రెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ వీడియోలతో ఓ ఊపు ఊపిన ఈ చిన్నది.. అప్పటి నుంచి హల్‌చల్ చేస్తూనే ఉంది. ఇక, తాజాగా తన సీక్రెట్ ప్లేస్‌లో ఉన్న పవన్ కల్యాణ్ టాటూను చూపించింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
PICS: ఇండియన్ కపుల్స్.. వైరల్ ఫోటోషూట్

జూనియర్ సమంతగా పేరు.. సినిమా ఛాన్స్
డబ్‌స్మాష్ వీడియోలతో ఓ రేంజ్‌లో పాపులర్ అయింది అషు రెడ్డి. అచ్చం సమంతలా కనిపించిన ఈ అమ్మడు.. డైలాగులు కూడా అదే రీతిలో చెప్పి మైమరపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫేమస్ అయింది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆమెను నితిన్ హీరోగా చేసిన 'ఛల్ మోహనరంగ'లో తీసుకున్నారు. ఈ ఒక్క సినిమాలోనే ఆమె నటించినా గుర్తింపు తెచ్చుకుంది.

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ... లుక్ చూసి షాక్
సినిమాలో నటించిన తర్వాత గ్యాప్ తీసుకుంది అషు రెడ్డి. ఈ క్రమంలోనే బాగా లావుగా తయారైంది. దీనికి డిప్రెషన్ తగ్గేందుకు వాడిన మందులేనని స్వయంగా వెల్లడించింది. ఇక, గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి బొద్దు లుక్‌తో ఎంట్రీ ఇచ్చిందీ భామ. దీంతో ఆమెను చూసిన వారంతా షాకైపోయారు. కానీ, అందానికి మాత్రం చాలా మంది ఫిదా అయ్యారు.

మొదటి నుంచీ యాక్టివ్.. ఫుల్ ఫాలోయింగ్
మొదటి నుంచీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది అషు రెడ్డి. వాస్తవానికి దీని ద్వారానే ప్రపంచానికి పరిచయం అవడంతో మరింత ఉత్సాహంగా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

రాహుల్ సిప్లీగంజ్‌తో డేటింగ్.. తెగ హల్‌చల్
కొద్ది రోజుల క్రితం రాహుల్ సిప్లీగంజ్.. అషు రెడ్డితో రియల్ రిలేషన్‌షిప్ ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అప్పటి నుంచి అమ్ముడు అతడితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. తరచూ రాహుల్‌తో కలిసి పార్టీలు చేసుకోవడం.. వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేయడం వంటివి చేస్తోంది. ఈ మధ్య అతడి షాప్ ఓపెనింగ్‌లోనూ మెరిసింది.

ప్రైవేటు ప్లేస్‌లో పవన్ కల్యాణ్ పేరుతో టాటూ
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని చెప్పుకొచ్చింది అషు రెడ్డి. అంతేకాదు, ఆయన పేరును ప్రైవేటు ప్లేస్‌లో టాటూగా వేయించుకున్నట్లు ఓ ఫొటోను కూడా షేర్ చేశారు ఆమె స్నేహితులు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అషు రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ కారణంగానే ఆమె పలుమార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది.

అలా లేపి చూపించిన బిగ్ బాస్ హాట్ భామ
తాజాగా మరోసారి తన టాటూను చూపించింది అషు రెడ్డి. తన కుడి చేతి కింద.. ఎద భాగం పక్కన పవన్ కల్యాణ్ అని వేయించుకున్న టాటూను చూపిస్తూ ఆమె ఓ ఫొటోను దిగింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీనికి పవర్ స్టార్ అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తుండగా.. కొందరు నెటిజన్లు షాకైపోవడంతో పాటు అషు రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











