twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ బ్యూటీ ప్రైవేటు ప్లేస్‌లో పవన్ టాటూ: ఇప్పుడేమో మరో పార్టీకి మద్దతుగా పోస్ట్

    |

    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తమలోని ప్రత్యేకమైన టాలెంట్లను బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు. తద్వారా సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో తెలుగమ్మాయి అషు రెడ్డి ఒకరు. అప్పట్లో ప్రపంచాన్ని ఊపేసిన డబ్‌స్మాష్ యాప్‌లో తన వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. పవన్ కల్యాణ్‌ పేరు ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ వేయించుకుని ఫేమస్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పార్టీకి మద్దతుగా పోస్ట్ చేసి షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

    జూనియర్ సమంత.. నితిన్ సినిమాలో

    జూనియర్ సమంత.. నితిన్ సినిమాలో

    డబ్‌స్మాష్ వీడియోలతో ఓ రేంజ్‌లో పాపులర్ అయింది అషు రెడ్డి. అచ్చం సమంతలా కనిపించిన ఈ అమ్మడు.. డైలాగులు కూడా అదే రీతిలో చెప్పి మైమరపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫేమస్ అయింది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆమెను నితిన్ హీరోగా చేసిన ‘ఛల్ మోహనరంగ'లో తీసుకున్నారు. ఈ ఒక్క సినిమాలోనే ఆమె నటించినా గుర్తింపు తెచ్చుకుంది.

    బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. లుక్ చూసి షాక్

    బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. లుక్ చూసి షాక్

    సినిమాలో నటించిన తర్వాత గ్యాప్ తీసుకుంది అషు రెడ్డి. ఈ క్రమంలోనే బాగా లావుగా తయారైంది. దీనికి డిప్రెషన్ తగ్గేందుకు వాడిన మందులేనని స్వయంగా వెల్లడించింది. ఇక, గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి బొద్దు లుక్‌తో ఎంట్రీ ఇచ్చిందీ భామ. దీంతో ఆమెను చూసిన వారంతా షాకైపోయారు. కానీ, అందానికి మాత్రం చాలా మంది ఫిదా అయ్యారు.

    అక్కడ ఫుల్ యాక్టివ్.. అందుకే క్రేజ్

    అక్కడ ఫుల్ యాక్టివ్.. అందుకే క్రేజ్

    మొదటి నుంచీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది అషు రెడ్డి. వాస్తవానికి దీని ద్వారానే ప్రపంచానికి పరిచయం అవడంతో మరింత ఉత్సాహంగా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

    ప్రైవేటు ప్లేస్‌లో పవన్ కల్యాణ్ టాటూ

    ప్రైవేటు ప్లేస్‌లో పవన్ కల్యాణ్ టాటూ

    బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని చెప్పుకొచ్చింది అషు రెడ్డి. అంతేకాదు, ఆయన పేరును ప్రైవేటు ప్లేస్‌లో టాటూగా వేయించుకున్నట్లు ఓ ఫొటోను కూడా షేర్ చేశారు ఆమె స్నేహితులు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అషు రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ కారణంగానే ఆమె పలుమార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది.

    ఇప్పుడేమో మరో పార్టీకి మద్దతుగా పోస్ట్

    ఇప్పుడేమో మరో పార్టీకి మద్దతుగా పోస్ట్

    ఇటీవల అషు రెడ్డి విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. అందులో అధికార పార్టీకి చెందిన నాయకులు సైతం హాజరయ్యారు. ఇదే వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ఆ పార్టీ మద్దతుదారులు సైతం వచ్చారు. తాజాగా దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలిందామె. దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కిందీ బొద్దుగుమ్మ.

    Recommended Video

    Actor Ananda Chakrapani Interview Part 3
    అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్లు

    అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్లు

    అషు రెడ్డి.. ఆ నాయకులతో కలిసి ఉన్న ఫొటోలు పెట్టడం.. దానికి సంబంధించిన పార్టీని ట్యాగ్ చేయడం పట్ల పవన్ కల్యాణ్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమెను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు, ‘నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు' అని రిప్లైలు ఇస్తున్నారు. మరికొందరేమో పవన్ పార్టీకి మద్దతుగా స్లోగన్స్ ఇస్తున్నారు.

    English summary
    Ashu Reddy is a born-American actress and model who made her film debut in a Telugu movie in 2018. She is also known as junior Samantha because of her hot look and appearance. After completing her graduation in 2016.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X