ఎద భాగంలో పవన్ కల్యాణ్ పేరు.. డ్రెస్ తీసి చూపించిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. అందుకే పవన్ పేరును క్యాష్ చేసుకోవాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆయన పేరు చెప్పుకుని ఫేమస్ అయిన వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. పవన్ పేరును తమకు అనుకూలంగా మలచుకోవాలనుకునే వారి జాబితాలోకి 'బిగ్ బాస్' కంటెస్టెంట్ అషు రెడ్డి కూడా చేరిపోయిందా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం మొత్తం చదివితే మీకే అర్థం అవుతుంది.

ఎవరీ అషు రెడ్డి?
అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసిన డబ్‌స్మాష్ ద్వారా అషు రెడ్డి బాగా పాపులర్ అయిపోయింది. చూడ్డానికి అచ్చం హీరోయిన్ సమంతాలా కనిపించే ఈమె.. తక్కువ వ్యవధిలోనే సెన్సేషన్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఎన్నో ఫొటోలు, వీడియోలు చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్ భారీగా పెరిగిపోయారు.

ప్రేమ విఫలం
సమంతను పోలినట్లు ఉండే అషు రెడ్డిది విశాఖపట్నం. ఆమె విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేసింది. అయితే, గ్రాడ్యుయేషన్ కోసం యూఎస్ వెళ్లింది. అది పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా చేసింది. ఆ సమయంలోనే ఒకరితో ప్రేమలో పడింది. అయితే, కొద్ది రోజుల్లోనే అది బ్రేకప్ అయిపోవడంతో, ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.

బిగ్ బాస్ ఎంట్రీ - ట్రోల్స్
అషు రెడ్డి ఇటీవల ప్రారంభమైన ‘బిగ్ బాస్' తెలుగు సీజన్ - 3లో కంటెస్టెంట్‌గా ఎంపికైంది. ఆమె ఎంట్రీ చూసిన జనం అందరూ కూడా షాక్ అయ్యారు. అందుకు కారణం.. ఆమె సమంతా లుక్‌లో కన్నా స్లిమ్‌గా కాకుండా బొద్దుగా ఉండడమే. దీంతో ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు చాలా మంది నెటిజన్లు.
పవన్‌కు వీరాభిమాని
అషు రెడ్డి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సార్లు స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, ఆయనతో ఫొటో కూడా దిగింది. దీన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది ఇక్కడితో ఆగలేదు. అషు రెడ్డి తన అభిమానాన్ని మరోలా కూడా చూపించింది. ఈ మేరకు అప్పట్లో ట్విట్టర్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది.

ఎద భాగంలో పవన్ పేరు
కత్తి మహేశ్ - పవన్ అభిమానులకు మధ్య వివాదం నడుస్తున్న సమయంలో అషు రెడ్డి చేసిన పోస్ట్ సంచలనం అయింది. ఆమె తన ఎద భాగంలో పవన్ కల్యాణ్ అనే పేరు టాటూలా వేయించుకుంది. దీన్ని షేర్ చేస్తూ ‘‘నేను పవన్ టాటూ వేయించుకున్నా.. అంటే దానర్థం నాకు ఆయనకు ఎఫైర్ ఉన్నట్లా..? జవాబు చెప్పండి' అంటూ కత్తి మహేశ్‌ను ట్యాగ్ చేసింది.

ఇప్పుడు వైరల్
అషు రెడ్డి అప్పట్లో చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అలాగే పవన్‌తో దిగిన ఫొటో కూడా ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం అషు రెడ్డి ‘బిగ్ బాస్'లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టడమే. ఆమెను సపోర్ట్ చేస్తున్న వారందరూ ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. దీంతో అషు రెడ్డి ఫొటో ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











