twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ పాలిటిక్స్ పనికిరాడు.. జూ. ఎన్టీఆర్ కొత్త పార్టీ.. ప్రముఖ జ్యోతిష్యుడి జోస్యం

    |

    ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై అనేక సందేహాలు, అనుమానాలు తలెత్తాయి. అలాగే తెలుగుదేశం పార్టీ దారుణమైన ఓటమి తర్వాత ఆ పార్టీపై కూడా ఇలాంటే అనుమానాలే వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు, ఎన్టీఆర్ భవిష్యత్ కార్యాచరణను ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇద్దరు స్టార్ హీరోల గురించి ఆయన చెప్పిన విషయాలు ఇవే..

    పవన్ కల్యాణ్ పనికిరాడంటే నాపై ట్రోల్స్

    పవన్ కల్యాణ్ పనికిరాడంటే నాపై ట్రోల్స్

    పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అని నేను అనడంతో ఆయన ఫ్యాన్స్ నా మీద మండిపడ్డారు. పలు టెలివిజన్ ఛానెళ్లలో నేను స్పష్టంగా చెప్పినాను. అయితే పవన్ ఫ్యాన్స్ తప్పుగా అర్ధం చేసుకొన్నారు. నా ఉద్దేశం ఏమిటంటే.. సమకాలీన రాజకీయాల్లో రాణించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధానాలను పాటించాలి. కప్పగంతు రాజకీయాలు చేయడం పవన్‌కు రాదు. దాంతో నన్ను ట్రోల్ చేశారని వేణుస్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    నమ్మక ద్రోహం చేయడం ఆయనకు రాదు

    నమ్మక ద్రోహం చేయడం ఆయనకు రాదు

    పవన్‌కు నమ్మక ద్రోహం, మాట ఇచ్చి తప్పడం, అతి, అవకాశ రాజకీయాలు చేయడం రాదు. పవన్ చాలా ముక్కుసూటి మనిషి. తాను నమ్మిన విషయాన్నే పాటిస్తాడు. ప్రస్తుత గ్రహాల ప్రకారం.. సినిమాలకు రాకపోవచ్చు. రాజకీయాల్లోనే ఉంటాడు. 2024లో పవన్ కల్యాణ్ ప్రభంజనం కొనసాగుతుంది. ఆయన పాలిటిక్స్‌లో నంబర్ వన్ అవుతాడు. కానీ అప్పటి పరిస్థితులను బట్టి.. మారిన విషయాలను, ప్రత్యర్థులను బట్టి బేరీజు వేయాల్సి ఉంటుంది అని వేణు స్వామి అన్నారు.

    పవన్‌ కల్యాణ్ చాలా సాదాసీదా వ్యక్తి

    పవన్‌ కల్యాణ్ చాలా సాదాసీదా వ్యక్తి

    పవన్ కల్యాణ్ చాలా సాదాసీదాగా ఉంటాడు. నాకు పవన్ కల్యాణ్‌తో ట్రావెల్ చేశాను. సుస్వాగతం, బంగారం, ఇతర సినిమాలకు నేనే ముహుర్తం పెట్టాను. ఆయన సింప్లిసిటిని పలుమార్లు దగ్గరగా చూశాను. పవన్ కల్యాణ్ పలుమార్లు చిరంజీవి సినిమా షూటింగ్‌కు వచ్చేవాడు. అప్పడు సాధారణ సిబ్బందితో కలిసి భోజనం చేశేవాడు. మెగాస్టార్ తమ్ముడిని అనే బిల్డప్ పవన్‌లో కనిపించదు అని వేణు స్వామి పేర్కొన్నారు.

    పవన్, రజనీ సింప్లిసిటి అలా

    పవన్, రజనీ సింప్లిసిటి అలా

    పవన్ కల్యాణ్, రజనీకాంత్ ఇద్దరిలో సింప్లిసిటీ చాలా సమీపం నుంచి చూశాను. మామూలు కుర్చీలో కూర్చుంటారు. పెదరాయుడు షూటింగ్‌లో టవల్ వేసుకొని కింద నిద్రపోయారు. అది చూసి నేను షాక్ అయ్యాను. అలాంటి సింప్లిసిటీ ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్. పవన్‌లో ఉండే లక్షణాలే నందమూరి బాలకృష్ణలో ఉంటాయి. పవన్ రాజకీయ జీవితం వేరు.. వ్యక్తిగత జీవితం వేరు అని వేణు స్వామి పేర్కొన్నారు.

    2024లో ఎన్టీఆర్ కొత్తపార్టీ?

    2024లో ఎన్టీఆర్ కొత్తపార్టీ?

    2024లో జూనియర్ ఎన్టీఆర్ కొత్తపార్టీ పెట్టవచ్చు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి రారు. 2023లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతారు. తెలుగుదేశం పార్టీకి దూరంగానే ఉంటాడు. అప్పటి పరిస్థితుల్లో పవన్, ఎన్టీఆర్ గ్రహబలం, జాతక బలం బట్టి వారి విజయవకాశాలు ఉంటాయి. ఇప్పడే వారి గురించి స్పష్టంగా చెప్పడం కష్టం అని వేణుస్వామి తెలిపారు.

    English summary
    Astrologist Venu Swamy given clarity of Pawan Kalyan and Junior NTR's political life. He said, Pawan will rock in 2024. NTR will be form new political party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X