క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో బాలీవుడ్ హీరోయిన్.. బర్త్ డే రోజున మరింత రొమాంటిక్‌గా
బాలీవుడ్ హీరోయిన్ అతియాశెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ అఫైర్ వ్యవహారం గత కొద్దికాలంగా బాలీవుడ్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరూ సోషల్ మీడియా సాక్షిగా ప్రేమ సందేశాలు పంపుకోవడం, ఒకరిపై మరొకరు తమ అభిమానాన్ని చాటుకోవడం జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి అతియాశెట్టి, రాహుల్ రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాల్లోకి వెళితే...

ఏప్రిల్ 18వ తేదీన జోష్‌తో
క్రికెటర్ కేఎల్ రాహుల్ తన జన్మదిన వేడుకను ఏప్రిల్ 18వ తేదీన జోష్‌తో జరుపుకొన్నారు. తన జన్మదిన రోజున ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఢిల్లీ కాపిటల్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు. తన సహచర టీమ్ మెంబర్స్‌తో బర్త్ డేను జరుపుకొన్నారు.

అతియా, రాహుల్ సెల్పీల జోరు
తన బర్త్ డే రోజున ప్రియురాలు అతియాశెట్టితో కేఎల్ రాహుల్ రొమాంటిక్ మూమెంట్స్ గడిపారు. వారిద్దరూ మిర్రర్ సెల్పీలను షేర్ చేసుకొన్నారు. గ్రేట్ ఫుల్ టు యూ.. హ్యాపీ బర్త్ డే అంటూ అతియాశెట్టి కామెంట్ పెట్టింది. రాహుల్‌తో విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సునీల్ శెట్టి, హార్ధిక్ పాండ్యా కామెంట్స్
ప్రియుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టు చేసిన ఫోటోపై అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, క్రికెటర్ హార్థిక్ పాండ్యా ఆ పోస్టుపై స్పందించారు. ట్రూలీ లవ్ అంటూ సునీల్ శెట్టి, మై క్యూటీస్ అంటూ హార్థిక్ పాండ్యా కామెంట్ చేశారు. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే సుమారు 7 లక్షల లైక్స్ వచ్చాయి.

ఆ పరిచయమే ప్రేమగా మారి
అతియాశెట్టి, రాహుల్ ప్రేమ వ్యవహారం విషయానికి వస్తే ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది అంటూ బాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది. అతియా, రాహుల్ ఇద్దరు ఫిబ్రవరి 2019 నుంచి డేటింగ్ చేస్తున్నారు. 2020 న్యూఇయర్ సమయంలో తమ స్నేహితులతో కలిసి వారిద్దరు థాయ్‌లాండ్‌లో విహార యాత్ర చేసిన విషయం తెలిసిందే.

కేఎల్ రాహుల్, అతియా కెరీర్స్
కేఎల్ రాహుల్, అతియా కెరీర్ విషయంలో చాలా బిజీగా ఉన్నారు. కేఎల్ రాహూల్ ఐపీఎల్ 14 సీజన్‌తో బిజీగా ఉన్నారు. అతియా విషయానికి వస్తే బాలీవుడ్‌లో అచితూచీ సినిమాలు చేస్తున్నారు. 2015లో హీరో మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత ముబాకరన్, నవాబ్‌జాదే, మోతీచూర్ చంకాచూర్ అనే సినిమాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











