twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దడ పుట్టిస్తున్న అల్లు అర్జున్ క్యారవాన్.. అసలు విషయం తెలిస్తే షాక్!

    |

    స్టైలిష్ స్టార్ అర్జున్ అన్నింటా స్టైలిష్ గానే ఉంటారు. రీల్ లైఫ్‌లో ఎంత స్టైల్ లుక్స్ ఇస్తారో రియల్ లైఫ్ లో కూడా అంతే స్టైలిష్‌గా ఉండటం బన్నీ ప్రత్యేకత. ఈ మేరకు ఖరీదైన దుస్తులు, వాచీ ఇతరత్రా వస్తువులు ధరిస్తుంటారు అల్లు అర్జున్. అయితే బన్నీ ఎంత కాస్లీ అనే విషయాన్ని తెలియజేసేలా ఆయన క్యారవాన్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా ఇందులోని ఫెసిలిటీస్, రేటు తెలిసి షాకవుతున్నారు జనం.

    బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ వద్ద బన్నీ క్యారవాన్ దర్శనమిచ్చింది. బ్లాక్ కలర్‌లో ఉన్న అల్లు అర్జున్ క్యారవాన్ పై ఆయన పేరును ప్రతిభింబించేలా AA అనే రెండు అక్షరాలు స్టైలిష్ గా ఉన్నాయి. ఇక ఈ క్యారవాన్ విలువ సుమారుగా 7 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇందులోని ఇంటీరియ‌ర్ కోసమే దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెట్టరట. ముంబైకి చెందిన ఓ ప్రముఖ డిజైనర్ కంపెనీ దీన్ని డిజైన్ చేసిందని అంటున్నారు. ఇక ఇందులో విలాస వంతమైన సకల సౌకర్యాలు ఉన్నాయట. దేశంలో మ‌రే హీరో కూడా ఇంత ల‌గ్జ‌రీ క్యారవాన్ ఉప‌యోగించ‌డం లేద‌ని టాక్‌ నడుస్తోంది.

    Atracts Allu Arjun’s Caravan On Trivikram Sets

    నా పేరు సూర్య డిసాస్టర్ తరువాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. బన్నీ కెరీర్‌లో 19 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ ట‌బు, స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుద‌ల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

    English summary
    Stylish Star Allu Arjun spent close to Rs 7 crores to design his new swanky caravan. After he purchased it for Rs 3.5 crores spent the same amount to design the interiors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X