Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దడ పుట్టిస్తున్న అల్లు అర్జున్ క్యారవాన్.. అసలు విషయం తెలిస్తే షాక్!
స్టైలిష్ స్టార్ అర్జున్ అన్నింటా స్టైలిష్ గానే ఉంటారు. రీల్ లైఫ్‌లో ఎంత స్టైల్ లుక్స్ ఇస్తారో రియల్ లైఫ్ లో కూడా అంతే స్టైలిష్‌గా ఉండటం బన్నీ ప్రత్యేకత. ఈ మేరకు ఖరీదైన దుస్తులు, వాచీ ఇతరత్రా వస్తువులు ధరిస్తుంటారు అల్లు అర్జున్. అయితే బన్నీ ఎంత కాస్లీ అనే విషయాన్ని తెలియజేసేలా ఆయన క్యారవాన్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా ఇందులోని ఫెసిలిటీస్, రేటు తెలిసి షాకవుతున్నారు జనం.
బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ వద్ద బన్నీ క్యారవాన్ దర్శనమిచ్చింది. బ్లాక్ కలర్లో ఉన్న అల్లు అర్జున్ క్యారవాన్ పై ఆయన పేరును ప్రతిభింబించేలా AA అనే రెండు అక్షరాలు స్టైలిష్ గా ఉన్నాయి. ఇక ఈ క్యారవాన్ విలువ సుమారుగా 7 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇందులోని ఇంటీరియర్ కోసమే దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెట్టరట. ముంబైకి చెందిన ఓ ప్రముఖ డిజైనర్ కంపెనీ దీన్ని డిజైన్ చేసిందని అంటున్నారు. ఇక ఇందులో విలాస వంతమైన సకల సౌకర్యాలు ఉన్నాయట. దేశంలో మరే హీరో కూడా ఇంత లగ్జరీ క్యారవాన్ ఉపయోగించడం లేదని టాక్ నడుస్తోంది.
నా పేరు సూర్య డిసాస్టర్ తరువాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. బన్నీ కెరీర్లో 19 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.