అల్లు అర్జున్ లగ్జరీ చూడండి.. మతిపోగొట్టే సౌకర్యాలతో కారవాన్.. ధర తెలిస్తే షాక్
Recommended Video
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండితెరపై ఎంత స్టైలిష్ గా కనిపిస్తారో.. నిజ జీవితంలో కూడా అంతే స్టైలిష్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో తనకు సంబందించిన అన్ని వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు బన్నీ. వాచీ, దుస్తులు మొదలుకొని అన్ని వస్తువులపై బన్నీ ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తుంటారు. ప్రతీ దాంట్లో కూడా కొత్తదనం, స్పెషాలిటీ ఉండాలని కోరుకుంటారాయన. ఈ నేపథ్యంలో ఆయన డిసైన్ చేయించుకున్న క్యారవాన్ చూపరులను ఆకర్షిస్తోంది. వివరాల్లోకి పోతే..

బ్లాక్ కలర్‌లో క్యారవాన్..
అల్లు అర్జున్ తన కోసమే, తన ఆలోచనలతో స్పెషల్‌గా ఈ క్యారవాన్ డిసైన్ చేయించుకున్నారని తెలుస్తోంది. చూడటానికే ఎంతో కాస్లీగా కనిపిస్తున్న ఈ క్యారవాన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ క్యారవాన్ మెగా అభిమానులను బాగా అట్రాక్ట్ చేస్తోంది.

ఫాల్కన్ పేరు.. సకల సౌకర్యాలు
తన కోసమే స్పెషల్‌గా తయారు చేయించుకున్న ఈ క్యారవాన్‌లో సకల సౌకర్యాలు ఉన్నాయి. ఓ విలాసవంతమైన ఇంటిలో ఉండే అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. టీవీ, బెడ్, సోఫా ఇలా అన్ని వస్తువులు ఇందులో కనిపిస్తున్నాయి. క్యారవాన్ ఇంటీరియర్ అంతా చూపిస్తూ ఫోటోలు తీసి నెటిజన్ల ముందుంచారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ స్పెషల్ లోగో.. ధర తెలిస్తే షాక్
అల్లు అర్జున్ క్యారవాన్ పై ఆయన పేరును ప్రతిభింబించేలా AA అనే రెండు అక్షరాలు స్టైలిష్ గా ఉన్నాయి. ఇక ఈ క్యారవాన్ విలువ సుమారుగా 7 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇందులోని ఇంటీరియర్ కోసమే దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెట్టరట. ముంబైకి చెందిన ఓ ప్రముఖ డిజైనర్ కంపెనీ దీన్ని డిజైన్ చేసిందని సమాచారం.

త్రివిక్రమ్‌తో కలిసి
ప్రస్తుతం అల్లు అర్జున్- త్రివిక్రమ్‌తో కాంబోలో సినిమా కొత్త సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











