Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అల్లు అర్జున్ 'రేంజ్' రోవర్.. మామూలుగా స్టైల్ కాదండోయ్! పైగా దానికి భలే పేరు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండితెరపై ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో.. నిజ జీవితంలో కూడా అంతే స్టైలిష్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే తనకు సంబందించిన అన్ని వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. వాచీ, దుస్తులు మొదలుకొని అన్ని వస్తువులపై బన్నీ ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తుంటారు. ప్రతీ దాంట్లో కూడా కొత్తదనం, స్పెషాలిటీ ఉండాలని ఈ సారి తన రేంజ్ రోవర్ కారును ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇది చూపరులను వివరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
కారుపై చేయి.. యమ స్టైల్
తన కొత్త రేంజ్ రోవర్ కారును అభిమానులకు చూపించిన అల్లు అర్జున్.. తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు. కారుపై చేయి వేసి యమ స్టైల్ గా నిల్చున్న పిక్ షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. ఈ పిక్ లో బన్నీ, అతని కారు చూసి తెగ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
|
భలే పేరు పెట్టాడులే..
తన కొత్త రేంజ్ రోవర్ కారుకు ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నారు అల్లు అర్జున్. ‘బీస్ట్' అని దానికి నామకరణం చేసినట్లుగా తెలిపాడు. ఆ పేరులో స్పెషల్ ఏంటంటారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక వాహనం నిక్ నేమ్ కూడా బీస్ట్. 'ఏ వస్తువు కొన్నా ప్రతిసారి నా మదిలో మెదిలేది ఒకటే.. అదే కృతజ్ఞత' అని ట్యాగ్ చేస్తూ ఈ కారును పరిచయం చేశాడు బన్నీ.
గతంలో క్యారవాన్.. ఇప్పుడు కారు
అల్లు అర్జున్.. ఇటీవలే తన క్యారవాన్‌ని కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సకల సౌకర్యాలతో ఉన్న ఈ క్యారవాన్ బన్నీ అభిమానులను అబ్బురపరిచింది. ఈ లోగానే మరోసారి తన కాస్ట్లీ రేంజ్ రోవర్ పరిచయం చేసి తన విలాస వంతమైన జీవితం గురించి చెప్పకనే చెప్పాడు బన్నీ.
‘అల.. వైకుంఠపురంలో..'
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురంలో..' పేరుతో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై బన్నీ, త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.