గత వారమే V చూశాను.. అవసరాల శ్రీనివాస్ కామెంట్స్ వైరల్
అవసరాల శ్రీనివాస్, నాని, ఇంద్రగంటి మోహన కృష్ణ అంటే అందరికీ అష్టా చమ్మా చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ సినిమా చేసిన మ్యాజిక్ అటువంటిది. అష్టాచమ్మా నాని, అవసరాల శ్రీనివాస్ కెరీర్‌ను మలుపుతిప్పింది. అక్కడి ఈ ముగ్గురి బంధం బలపడింది. వీరి కాంబోలో జెంటిల్‌మెన్ అనే భిన్న చిత్రం కూడా వచ్చింది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తాజాగా ఇంద్రగంటి-నాని కాంబోలో వస్తోన్న V చిత్రంపై అవసరాల కామెంట్స్ చేశాడు.
ఇంద్రగంటి కెరీర్‌లో భిన్నంగా ట్రై చేసిన చిత్రం V. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్‌లతో ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగాయి. ఎన్నో అనూహ్యమైన మలుపుల తరువాత V చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఒప్పుకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ఓ రేంజ్‌లో చేపట్టారు. తాజాగా ఈ సినిమాపై అవసరాల శ్రీనివాస్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున నాని, నేను ఇంద్రగంటి మోహనకృష్ణ మూడో సినిమా అష్టాచమ్మా గురించి ఎంతగానో ఎదురుచూశాం. అదే మాకు డెబ్యూ సినిమా అయింది. అయితే ఇప్పుడు ఇంద్రగంటి, నానిలు తమ మూడో చిత్రమైన Vతో రెడీగా ఉన్నారు. వారితో నాకున్న స్నేహబంధం కారణంగా ఈ చిత్రాన్ని నేను గత వారమే చూసే అదృష్టం కలిగింది. థ్రిల్లర్, థ్రిల్ల్‌డ్‌కు మధ్య ఉన్న అనుభూతిని నేను పొందాను. అది పూర్తిగా థ్రిల్లర్. మీకు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది..అందుకే అర్ధరాత్రి అమెజాన్ ప్రైమ్‌లో రాబోతోందని మీకు రిమైండ్ చేస్తున్నాను. అంటూ అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











