twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Avengers Endgame First Review: జై కొట్టిన హాలీవుడ్ క్రిటిక్స్.. రేటింగ్ ఎంతంటే..

    |

    హాలీవుడ్‌లో అవెంజర్స్: ఎండ్ గేమ్ మూవీ రెండు రోజుల ముందుగానే సందడి మొదలైంది. ఈ సినిమా గురించి అప్పుడే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో హల్‌చల్ మొదలైంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న 22వ సినిమా గురించి హాలీవుడ్ క్రిటిక్స్ జై కొడుతున్నారు. ఈ సినిమా గురించి హాలీవుడ్‌లో వచ్చిన రివ్యూలు ఇవే..

     96 శాతం స్కోరింగ్‌తో

    96 శాతం స్కోరింగ్‌తో

    హాలీవుడ్‌లో మూవీ రివ్యూ వెబ్ సైట్ రాటెన్ టామాటోస్ (Rotten Tomatoes ) ప్రకారం.. అవెంజెర్స్: ఎండ్ గేమ్ ఎక్సైటింగ్, ఎంటర్‌టైనింగ్, ఎమోషనల్‌, ప్రభావంతంగా ఉంది. మార్వెల్ సీక్వెల్‌లో చిట్టచివరి చిత్రంగా భావిస్తున్న ప్రేక్షకుడికి పంచభక్ష పరమాన్నంలా అన్నింటిని అందించింది అని వెల్లడించింది. ఈ సినిమాకు 96 శాతం స్కోరింగ్ ఇవ్వడం విశేషం.

     షికాగో ట్రిబ్యున్ రివ్యూ

    షికాగో ట్రిబ్యున్ రివ్యూ

    షికాగో ట్రిబ్యున్ ప్రకారం.. భారీ హంగులు, అత్యాధునిక సాంకేతికతతో గొప్ప అనుభూతికి గురిచేస్తుంది. ఈ చిత్రం నేరుగా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. సూపర్ హీరోల పాత్రల పునపరిచయం, వీడ్కోలు లాంటి సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి అని సమీక్షించింది.

    న్యూయార్క్ టైమ్స్ రివ్యూ

    న్యూయార్క్ టైమ్స్ రివ్యూ

    న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. సరైన సమయంలో సరైన వ్యక్తులకు ఎలా మంచి చేయాలనే థీమ్‌తో సినిమా ఆసక్తికరంగా తెరకెక్కించారు. మార్వెల్ సీక్వెల్స్‌లో మరో గొప్ప మూవీ. గత చిత్రాలను నెమరు వేసుకొనే సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. ప్రేక్షకుల దృష్టిలో మరో మంచి చిత్రంగా మిగులుతుంది అని తెలిపింది.

    హాలీవుడ్ రిపోర్టర్ రివ్యూ

    హాలీవుడ్ రిపోర్టర్ రివ్యూ

    హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం.. భారీ సంఖ్యలో యాక్షన్ సీన్లు, దాడులు, ప్రతీదాడులతో థియేటర్ దద్దరిల్లుతుంది. గత చిత్రాల్లో ఉండే అస్పష్టత, సందేహాలు ఈ చిత్రంలో కనిపించవు. ఈ సినిమాకు యాక్షన్ ఎపిసోడ్స్ తారాస్థాయిలో ఉంటాయి అని వెల్లడించింది.

    లాస్ ఎంజెలెస్‌లో ప్రీమియర్ ప్రదర్శన

    లాస్ ఎంజెలెస్‌లో ప్రీమియర్ ప్రదర్శన

    అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం ప్రీమియర్ షో మంగళవారం రాత్రి లాస్ ఎంజెలెస్‌లో ప్రదర్శించారు. హలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాకు పొటేత్తారు. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించారు.

    English summary
    Reviews have begun to trickle in for Avengers Endgame and fans are nervously avoiding social media to steer clear of spoilers. The Marvel mammoth is the finale to the 22 films in the Marvel Cinematic Universe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X