విలన్‌గా నటించడానికి నేను రెఢీ.. బాలకృష్ణ

నందమూరి నటవారసుడు బాలకృష్ణ విభిన్నమైన పాత్రలతో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. హీరోగా ఆయన నటించిన చిత్రాలు ఎక్కువగానే బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తాజాగా తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మధ్య దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల్లో పాల్గొన్నారు.

గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో అద్బుతమైన నటనకు గాను బాలకృష్ణ ఉత్తమ నటుడిగా సైమా అవార్డును అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో యువ హీరో రానాతో కలిసి రెడ్ కార్పెట్‌పై హంగామా చేశారు. ఈ సందర్భంగా తాను విలన్‌గా నటించాడనికి సిద్దమేనని ప్రకటన చేశారు.

Bala Krishna at SIIMA: I am ready for Villain roles

ఇప్పటి వరకు ఎన్నో హీరో పాత్రలను వేసిన నేను ప్రతి నాయక పాత్రల్లో నటించేందుకు సిద్ధం. నెగిటివ్ రోల్స్ చేస్తే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తారేమో. ఇంకా కేసు పెడుతారని ఊహించడం కూడా తప్పు కాదేమో అని బాలకృష్ణ అనడంతో అభిమానులు నవ్వుల్లో మునిగిపోయారు.

ఎన్టీఆర్ బయోపిక్‌ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రంలో పలువురు అగ్రహీరోలు, క్రేజీ నటులు నటిస్తున్నారు. రానా దగ్గుబాటి, మరాఠీ నటుడు సచిన్ ఖేడ్కర్, బెంగాళీ యాక్టర్ జిషు సేన్‌గుప్తా, మంజిమా మోహన్ లాంటి ప్రముఖులు చేరికతో ఈ సినిమా ప్రతిష్ఠాత్మకంగా మారింది.

జిషు సేన్‌గుప్తా ఎల్వీ ప్రసాద్‌గా కనిపించబోతున్నాడు. మంజిమా మోహన్ నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిగా, రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవిగా కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X