అసలు దమ్ము పార్ట్ 2లో తెలుస్తుంది: బయోపిక్ చూసిన బాలయ్య కూతురు, స్పీచ్ కేక!

Recommended Video

NTR Kathanayakudu : Nara Brahmini Talks About The Movie | Filmibeat Telugu

'ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రాన్ని నందమూరి కుటుంబ సభ్యుల కోసం ఎఎంబి సినిమాస్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. బాలయ్యతో పాటు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఈ షోకు హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం నారా బ్రహ్మాణి తన ఎక్స్‌పిరియన్స్ మీడియాతో పంచుకున్నారు.

తెరపై నాన్నగారిని చూసినపుడు అచ్చం తాతగారిలా కనిపించారు. మనవరాలిగా తాతగారితో నేను చాలా తక్కువ సమయం గడిపాను. సినిమా చూస్తే అందరికీ తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ ప్రజా సేవ గురించి ఆలోచించేవారు. ఫ్యామిలీతో చాలా తక్కువ సమయం గడిపారని నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు.

చాలా గర్వంగా ఫీలయ్యా

చాలా గర్వంగా ఫీలయ్యా

తాతగారి జీవితంలోని చాలా విషయాలు ఈ సినిమాలో చూడటం జరిగింది. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి పాలిటిక్స్‌లో ఎంటరయ్యే వరకు తాతగారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. సినిమా చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించిందని బ్రాహ్మణి తెలిపారు.

నాయనమ్మ గొప్పదనం తెలిసింది

నాయనమ్మ గొప్పదనం తెలిసింది

నాయనమ్మ బసవతారకంగారితో కూడా నేను అసలు సమయం గడపలేదు. నేను పుట్టడానికి ముందే ఆమె పోయారు. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తో సినిమా చూసిన తర్వాత అర్థమైంది. తాతగారు సినిమాల్లోకి వచ్చే సమయంలో, రాజకీయాల్లోకి వచ్చే సమయంలో చాలా సపోర్ట్ ఉన్నారు. వారి కథ తెలుసుకోవడం చాలా బాగా అనిపించిందని తెలిపారు.

తాతగారి అసలు దమ్ము పార్ట్ 2లో తెలుస్తుంది

తాతగారి అసలు దమ్ము పార్ట్ 2లో తెలుస్తుంది

నాన్నగారు, సుమంత్ గారు, కళ్యాణ్ అన్న, రానాగారు, విద్యాబాలన్ గారు... టెక్నీషియలన్లు అంతా చాలా ఎఫర్ట్ పెట్టారు. సినిమా రెండో భాగంపై కూడా ఆసక్తి పెరిగింది. ఎన్టీఆర్‌గారి నిజమైన దమ్ము పార్ట్ 2లో కనిపిస్తుంది.

క్రిష్ దర్శకత్వం అద్భుతం

క్రిష్ దర్శకత్వం అద్భుతం

సినిమాలో అందరూ బాగా చేశారు. ఎవరూ నటించినట్లు అనిపించలేదు జీవించినట్లు అనిపించింది. క్రిష్ గారి దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఒక సినిమాలా కాకుండా కళ్లముందు జరిగిన ఒక కథలా చూపించారు. నాన్నగారి ప్రొడక్షన్లో ఫస్ట్ మూవీ కావడం మరింత సంతోషపడే విషయమని బ్రాహ్మణి తెలిపారు.

బాల బాబాయ్ ఎక్స్ ట్రార్డినరీ: సుహాసిని

బాల బాబాయ్ ఎక్స్ ట్రార్డినరీ: సుహాసిని

నాకు తెలియని చాలా వాస్తవాలు తాతగారి గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకున్నట్లు నందమూరి సుహాసిని తెలిపారు. తాతగారిలా బాల బాబాయ్, నాన్నగారిలా కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటించారు. క్రిష్ సినిమాను తెరకెక్కించిన విధానం బావుంది. సినిమా అందరూ చూసి విజయానికి తోడ్పడాలి. బాల బాబాయ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఆయన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని సుహాసిని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X