బాలకృష్ణ గొడవ పడి ఆపేసిన సినిమా టైటిల్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. సినిమాలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. వీలైనంత వరకు ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్లుగానే పవన్ ను ప్రజెంట్ చేయడానికి దర్శకులు ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం వకీల్ సాబ్ కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో గాని అంతకంటే ఎక్కువగా మాత్రం ఆ తరువాత వచ్చే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.
ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హిస్టారికల్ డ్రామాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా టైటిల్ మొదట బాలయ్య సినిమా కోసం అనుకుందేనట.
జిమ్‌లో మలైకా అరోరా కసరత్తులు.. పోటి దుస్తులతో గ్లామర్ పంట

క్రిష్ సినిమాను కూడా జెట్ స్పీడ్ లో..
వకీల్ సాబ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో బిజీ అయ్యాడు. ఆ సినిమా కోసం కేవలం 40రోజుల కాల్షీట్స్ ఇచ్చిన పవన్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పిరియాడిక్ స్టోరీని కూడా తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. అప్పట్లో ఆ సినిమా కోసం పవన్ కోర మీసాలు పొడవు జుట్టు కూడా పెంచాడు.

టైటిల్ అయితే అదే..
ఇక సినిమా టైటిల్ ను హరహర మహాదేవ అని ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా పక్కా సమాచారం అందుతోంది. అయితే ఆ సినిమా టైటిల్ ను ఇది వరకు బాలకృష్ణ సినిమా అనుకున్నారట. ఇప్పుడు ఆ టైటిల్ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలిసి దర్శకుడు క్రిష్ ఫైనల్ చేశాడట.

బాలకృష్ణ సినిమాకు ఆ టైటిల్..
టైటిల్ విషయంలోకి వెళితే.. బాలకృష్ణ, బి గోపాల్ దర్శకత్వంలో 17 ఏళ్ల క్రితం ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆల్ మోస్ట్ కథ సెట్టయ్యింది. నిర్మాతగా బెల్లంకొండ సురేష్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. ఆ సినిమాకు హరహర మహాదేవ అనే టైటిల్ ను కూడా ఫైనల్ చేశారు. కానీ అప్పుడే బాలకృష్ణకు బెల్లంకొండ సురేష్ కు గొడవలు అవ్వడంతో సినిమా క్యాన్సిల్ అయ్యింది.
Recommended Video

మళ్ళీ ఇన్నాళ్లకు..
ఇక మళ్ళీ ఇన్నాళ్లకు దర్శకుడు క్రిష్ ఆ సినిమా టైటిల్ ను తెరపైకి తెచ్చాడు. సినిమా కథకు ఆ టైటిల్ కరెక్ట్ గా సెట్టవుతుందని పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్రిష్ పెద్దగా ఆలోచించలేదట. ఇదివరకు అనేక రకాల టైటిల్స్ అనుకున్నప్పటికి వాటన్నిటినీ పవన్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











