twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణతో తొమ్మిది మంది హీరోయిన్లు.. ఎవరెవరు.. ఏ సినిమాలోనంటే?

    |

    తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ప్రపంచపటంపై ఎగురవేసిన మహానుభావుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌‌ను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రోజు రోజుకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఏకంగా తొమ్మిది మంది టాప్ హీరోయిన్లను రంగంలోకి దించడమే. వివరాల్లోకి వెళితే..

    కథానాయకుడి కోసం తొమ్మిది మంది

    కథానాయకుడి కోసం తొమ్మిది మంది

    ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. తొలి పార్టును కథానాయకుడు పేరుతో రెండో భాగాన్ని మహానాయకుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ సిని జీవితం ఉంటుంది. దాంతో అలనాటి హీరోయిన్ల కోసం పలువురు టాలీవుడ్ అందాల భామలను బరిలోకి దించారు.

    బసవతారకంగా నటి విద్యాబాలన్

    బసవతారకంగా నటి విద్యాబాలన్

    ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటించనున్నారు. తొలిసారి ఈ చిత్రం ద్వారా విద్యా బాలన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇంకా ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. వేటగాడులోని ఆకుచాటు పిందే తడిసే పాటలో జోష్‌గా స్టెప్పులు వేసినట్టు సమాచారం.

    బాలకృష్ణ ఒక ఎన్‌సైక్లో పీడియా : సుమంత్ కామెంట్బాలకృష్ణ ఒక ఎన్‌సైక్లో పీడియా : సుమంత్ కామెంట్

    సావిత్రి పాత్రలో నిత్యామీనన్

    సావిత్రి పాత్రలో నిత్యామీనన్

    ఎన్టీఆర్ బయోపిక్‌లో సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్‌ను తీసుకొంటారని అనుకొన్నారు. కానీ క్రిష్ అంచనాలను తారుమారు చేస్తూ నిత్యామీనన్‌ను సావిత్రిగా చూపించారు. సావిత్రి పాత్రలో నిత్య మీనన్ ఒదిగిపోయినట్టు కనిపించింది.

     అనుష్క, షాలిని పాండే పాత్రలు

    అనుష్క, షాలిని పాండే పాత్రలు

    ఎన్టీఆర్ బయోపిక్‌లో అనుష్క శెట్టికి కూడా మంచి పాత్రే దక్కింది. అనుష్క అలనాటి తార సరోజాదేవి పాత్రలో కనిపించనున్నారు. అలాగే అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే షావుకారు జానకిగా నటించారు. ఈ పాత్రలో షాలిని పాండే అద్భుతంగా కనిపించినట్టు సమాచారం.

     హన్సిక, మాళవిక, పాయల్ రాజ్‌పుత్ రోల్స్

    హన్సిక, మాళవిక, పాయల్ రాజ్‌పుత్ రోల్స్

    ఇటీవల కాలంలో టాలీవుడ్‌కు దూరమైన హన్సిక మోత్వాని ఈ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది. జయప్రద పాత్రలో హన్సిక నటించారు. అలాగే మాళవిక నాయర్ జయప్రదగా, పాయల్ రాజ్‌పుత్ కృష్ణకుమారిగా నటించారు. ఈ పాత్రలు ఎన్టీఆర్ బయోపిక్‌కు వన్నెతేవడమే కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడం ఖాయం.

    English summary
    NTR Kathanayakudu stars nine heroines. Vidya Balan to Rakul Preet Singh, Nithya Menen, Anushka, Hansika and Manjima Mohan are also part of NTR Kathanayakudu. NTR Kathanayakudu, the biopic of Telugu superstar and former Chief Minister of undivided Andhra Pradesh NT Rama Rao, is one of the biggest upcoming Telugu movies, which will hit the screen in 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X