రొచ్చగొట్టిన నాగబాబు.. మౌనం దాల్చిన బాలకృష్ణ.. నివురు గప్పిన నిప్పులా..
టాలీవుడ్‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల, దానికి మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన కౌంటర్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ట దిగజార్చేలా ఎవరికి వారు ప్రకటనలు, అభిప్రాయాలు చేయవద్దని టాలీవుడ్ పెద్దల తమ వర్గాలకు, యూనియన్లకు గట్టిగానే చెప్పడంతో ఇప్పుడు పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. అయితే నాగబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తర్వాత బాలకృష్ణ మౌనం దాల్చడంపై సినీ వర్గాల్లో చర్చ తీవ్రంగా జరుగుతున్నది. ఇంతకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది.. ఇక వివరాల్లోకి వెళితే...
Recommended Video

బాలకృష్ణ ఆవేశ పూరిత వ్యాఖ్యలు
టాలీవుడ్ వర్గాలు సినిమా షూటింగులు, థియేటర్ల ఓపెనింగ్ తదితర విషయాలపై చర్చలకు తనను విస్మరిస్తున్నారని బాలకృష్ణ ఆవేశంగా తన ఆవేదనను వెళ్లగక్కడం సినీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వర్గం తమ వంతుగా మీడియాలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

నాగబాబు తీవ్రంగా రియాక్ట్ కావడంతో
ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించడంతోపాటు వార్నింగ్ ఇవ్వడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. బాలకృష్ణ పరిశ్రమ వర్గాలను కించపరిచేలా మాట్లడటం తగదని, అందుకు క్షమాపణ చెప్పాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి అని నాగబాబు గట్టిగా మందలించడంతో సినీ పరిశ్రమలో భిన్నవాదనలు వినిపించాయి.

బాలకృష్ణ రియాక్షన్ ఏ విధంగా అంటూ
ఇక నాగబాబు ఇచ్చిన కౌంటర్‌కు బాలకృష్ణ ఏం రేంజ్‌లో స్పందిస్తారనే విషయంపై పెద్దగానే చర్చ జరిగింది. అయితే అందరి అంచనాలకు భిన్నంగా బాలయ్య మౌనం దాల్చడం.. ఈ వివాదంపై తన నుంచి గానీ, తన వర్గాల నుంచి స్పందన రాకపోవడంతో అంతా ఏం జరుగుతున్నదనే సందేహాలు వ్యక్తం చేశారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుందనే వారికి ఆశ్చర్యం కలిగించింది

వివాదాలకు సమయం కాదు..
అయితే ప్రస్తుతం వివాదాలకు, కౌంటర్లు, ఎన్‌కౌంటర్లకు సమయం కాదు. ఇరు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతుండటం, వారు సానుకూలంగా స్పందిస్తుండటం వల్ల పరిశ్రమకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో చర్చలు పక్కదారి పక్కకుండా సంయమనం పాటించాలని కొందరు నిర్మాతలు అటు బాలయ్య, నాగబాబు వర్గాలను కట్టడి చేసినట్టు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపైనే
ఇక ప్రస్తుతం పరిస్థితులు పరిశ్రమకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ఏ మేరకు అనుమతులు ఇస్తారనే విషయంపై చర్చ జరుగుతున్నది. టాలీవుడ్‌లో సినిమాల నిర్మాణం ఆగిపోయి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటం, వేతన కార్మికుల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతున్న నేపథ్యం మరింత ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొబోయే నిర్ణయం వైపే అందరూ దృష్టి సారించారు.


Click it and Unblock the Notifications











