Don't Miss!
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
‘భోలా నాగేంద్రుడి కి జన్మదిన శుభాకాంక్షలు’.. నాగబాబుపై బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
బండ్ల గణేష్‌కు మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందరి గురించి చాలా గొప్పగానే మాట్లాడతాడు. స్టేజ్ ఎక్కితే మాటల ప్రవాహం ఉరకలెత్తుతుంది. స్టేజ్ మీద ప్రసంగాలు ఇవ్వాలంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తరువాత అంత గొప్పగా, అంతటి వర్ణనలు బండ్ల గణేష్ మాత్రమే ఇవ్వగలడు. అందులో మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ గురించి అయితే బండ్ల గణేష్ కంటే బాగా ఎవ్వరూ మాట్లాడలేరు. కొందరు వాటిని భజన అని అంటారు. కానీ బండ్ల గణేష్ వాటిని ఎన్నడూ పట్టించుకోలేదు.
మెగా ఫ్యామిలీపై ప్రత్యేక అభిమానం..
బండ్ల గణేష్‌కు మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అందరూ ఇష్టమైనా సరే ఎవరిని ఎలా మాటలతో మెప్పించాలో తెలిసిన వాడు. పవన్ కళ్యాణ్‌ను దేవుడు, దైవం అంటూ కొలుస్తాడు. అంతే స్థాయిలో చిరంజీవిని కూడా మోసేస్తాడు. నాగబాబును కూడా బండ్ల గణేష్ ఓ రేంజ్లో ప్రశంసిస్తాడు.
నేడు నాగబాబు బర్త్ డే..
మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే నేడు (అక్టోబర్ 29). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఇలా అందరూ విషెస్ చెబుతున్నారు. అందరిలో కెల్లా చిరు చెప్పిన విషెస్, షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతున్నాయి. చిరు షేర్ చేసిన ఫోటోను బండ్ల గణేష్ తీసుకున్నట్టున్నాడు.
బోలా నాగేంద్రుడు..
భోలా నాగేంద్రుడు అంటూ నాగబాబు గురించి ఒక్క ముక్కలో చెప్పేశాడు. భోలా శంకరుడిలాంటి వాడని చెబుతూనే భోళా నాగేంద్రుడు అంటూ విషెస్ చెప్పాడు. ‘బోలా నాగేంద్రుడి కి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఇందులో కొందరు బండ్ల గణేష్ ట్వీట్‌ను చూస్తే ఇంకొందరు బండ్ల గణేష్ ప్రొఫైల్ పిక్చర్‌ను చూస్తున్నారు. బాగుంది అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.
Recommended Video
నిహారిక స్పెషల్ విషెస్..
నిహారిక తాజాగా నాగబాబు బర్త్ డే విషెస్ చెప్పింది. చిన్నతనంలో నాగబాబుతో దిగిన ఓ క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. నాన్న నువ్ ఇంకా సరదాగా ఉండాలి.. ఇంకా హ్యాండ్సమ్గా అవ్వాలి.. రోజురోజుకూ యంగ్‌గా తయారవ్వాలని కోరుకుంది.