twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘భోలా నాగేంద్రుడి కి జన్మదిన శుభాకాంక్షలు’.. నాగబాబుపై బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్

    |

    బండ్ల గణేష్‌కు మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందరి గురించి చాలా గొప్పగానే మాట్లాడతాడు. స్టేజ్ ఎక్కితే మాటల ప్రవాహం ఉరకలెత్తుతుంది. స్టేజ్ మీద ప్రసంగాలు ఇవ్వాలంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తరువాత అంత గొప్పగా, అంతటి వర్ణనలు బండ్ల గణేష్ మాత్రమే ఇవ్వగలడు. అందులో మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ గురించి అయితే బండ్ల గణేష్ కంటే బాగా ఎవ్వరూ మాట్లాడలేరు. కొందరు వాటిని భజన అని అంటారు. కానీ బండ్ల గణేష్ వాటిని ఎన్నడూ పట్టించుకోలేదు.

    మెగా ఫ్యామిలీపై ప్రత్యేక అభిమానం..

    మెగా ఫ్యామిలీపై ప్రత్యేక అభిమానం..

    బండ్ల గణేష్‌కు మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అందరూ ఇష్టమైనా సరే ఎవరిని ఎలా మాటలతో మెప్పించాలో తెలిసిన వాడు. పవన్ కళ్యాణ్‌ను దేవుడు, దైవం అంటూ కొలుస్తాడు. అంతే స్థాయిలో చిరంజీవిని కూడా మోసేస్తాడు. నాగబాబును కూడా బండ్ల గణేష్ ఓ రేంజ్‌లో ప్రశంసిస్తాడు.

    నేడు నాగబాబు బర్త్ డే..

    నేడు నాగబాబు బర్త్ డే..

    మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే నేడు (అక్టోబర్ 29). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఇలా అందరూ విషెస్ చెబుతున్నారు. అందరిలో కెల్లా చిరు చెప్పిన విషెస్, షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతున్నాయి. చిరు షేర్ చేసిన ఫోటోను బండ్ల గణేష్ తీసుకున్నట్టున్నాడు.

    బోలా నాగేంద్రుడు..

    బోలా నాగేంద్రుడు..

    భోలా నాగేంద్రుడు అంటూ నాగబాబు గురించి ఒక్క ముక్కలో చెప్పేశాడు. భోలా శంకరుడిలాంటి వాడని చెబుతూనే భోళా నాగేంద్రుడు అంటూ విషెస్ చెప్పాడు. ‘బోలా నాగేంద్రుడి కి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఇందులో కొందరు బండ్ల గణేష్ ట్వీట్‌ను చూస్తే ఇంకొందరు బండ్ల గణేష్ ప్రొఫైల్ పిక్చర్‌ను చూస్తున్నారు. బాగుంది అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.

    Recommended Video

    Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
    నిహారిక స్పెషల్ విషెస్..

    నిహారిక స్పెషల్ విషెస్..

    నిహారిక తాజాగా నాగబాబు బర్త్ డే విషెస్ చెప్పింది. చిన్నతనంలో నాగబాబుతో దిగిన ఓ క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. నాన్న నువ్ ఇంకా సరదాగా ఉండాలి.. ఇంకా హ్యాండ్సమ్‌గా అవ్వాలి.. రోజురోజుకూ యంగ్‌గా తయారవ్వాలని కోరుకుంది.

    English summary
    Bandla Ganesh Birthday Wishe To Nagababu, On Nagababu Birthday Socila media Showers Love.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X