ప్రభాస్ ‘సలార్’పై బండ్ల గణేష్ ట్వీట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్
బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ బండ్ల గణేష్‌ను ఎంతలా మార్చివేసింది మనమంతా చూస్తూనే ఉన్నాం. అనవసరమైన గొడవల్లోకి వెళ్లడం లేదు..ఎవరైనా చురకలు అంటించి.. లాగుదామని చూసినా కూడా శాంతంగానే స్పందిస్తున్నాడు. కరోనా వైరస్ వచ్చి.. చావు చివరి అంచు వరకు వెళ్లి చూశాక తనకు జీవితమంటే ఏంటో అర్థమైందని బండ్ల గణేష్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
అలాంటి బండ్ల గణేష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యాడు. ఎవరు ఎలాంటి సాయం అడిగినా స్పందిస్తున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనను రాజకీయాల్లో లాగుదామని ఎంత ట్రై చేసిన, ఎన్ని రూమర్లు వచ్చినా కూడా వాటిని ఖండిస్తూనే వచ్చాడు. అయితే ఎన్నికలు ముగిశాక మాత్రం బండ్ల గణేష్ ప్రకాశ్ రాజ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. బండ్ల గణేష్ చేసిన వరుస ట్వీట్లు బాగానే వైరల్ అయ్యాయి.

తాజాగా బండ్ల గణేష్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ సినిమాపై కామెంట్ చేశాడు. ప్రభాస్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదన్న సంగతి బండ్లన్నకు తెలియదు. ప్రభాస్ ఫ్యాన్ అకౌంట్ షేర్ చేసిన సలార్ పోస్టర్‌పై స్పందిస్తూ.. సూపర్ సర్ అని బండ్ల గణేష్ కామెంట్ చేశారు. అయితే అది అఫీషియల్ అకౌంట్ కాదని, అది ఫ్యాన్ అకౌంట్ అంటూ బండ్ల గణేష్‌ను నెటిజన్లు కామెంట్ల రూపంలో చెబుతున్నారు. ఇక కొందరు ఏదైతేనేం స్పందించాడు కదా అని డార్లింగ్ ఫ్యాన్స్ థ్యాంక్స్ అని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











